ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైద్యం గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఏఐ, చాట్‌ జీపీటీ లాంటి సైట్‌లలో ఏ విషయం అడిగినా ఒక్క క్షణంలోనే సమాచారం వస్తోంది. వాటినే నమ్మి వైద్యులను అనుమానించే వారూ ఎక్కువయ్యారు. ఫలానా వైద్యుడు తమను మోసం | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైద్యం గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఏఐ, చాట్‌ జీపీటీ లాంటి సైట్‌లలో ఏ విషయం అడిగినా ఒక్క క్షణంలోనే సమాచారం వస్తోంది. వాటినే నమ్మి వైద్యులను అనుమానించే వారూ ఎక్కువయ్యారు. ఫలానా వైద్యుడు తమను మోసం

May 25 2025 8:10 AM | Updated on May 25 2025 8:10 AM

ఉమ్మడ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ

కర్నూలుకు చెందిన రాజ్‌కుమార్‌ ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్‌. రోజూ వందల కిలోమీటర్లు తిరగడంతో అతనికి ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటుంది. దీంతో తరచూ డాక్టర్‌ వద్దకు వెళ్లడం దేనికని ఆన్‌లైన్‌లో తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు పరిష్కారాన్ని వెతికి మెడికల్‌ షాపులో మందులు కొని వాడుతున్నాడు. ఓ రోజు మందు లు వికటించి ఆసుపత్రికి వెళితే ఎలా పడితే అలా మందులు వాడకూడదని వైద్యులు చికిత్స చేసి పంపించారు.

కర్నూలుకు చెందిన ఓ బి.ఫార్మసి విద్యార్థిని తనకు ఇటీవల ఛాతీలో నొప్పి ఉంటే ఆన్‌లైన్‌లో టైప్‌ చేసి చూసుకుంటే హార్ట్‌ ఎటాక్‌ అని చూపించింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసింది. పరీక్షించిన వైద్యులు వచ్చింది హార్ట్‌ ఎటాక్‌ కాదని, కండరాల నొప్పిగా నిర్ధారించారు.

నంద్యాలకు చెందిన రామాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పనిచేయాల్సిందే. ఇంటర్‌నెట్‌పై మంచి పట్టు ఉంది. దీంతో తనతో పాటు ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలువచ్చినా ఆన్‌లైన్‌లో వెతికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆయన తల్లికి ఒకసారి మందులు వికటించి ఇబ్బంది రావడంతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆన్‌లైన్‌ పరిష్కారం ప్రతిసారీ మంచిది కాదని వైద్యులు హితవు పలికారు.

ఇవీ నష్టాలు..

ఆరోగ్య సమస్య కొంతైతే ఆన్‌లైన్‌లో వివరాలు కొండంత ఉంటాయి. దానిని చూసి రోగి మరింత ఆందోళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా మరింత కృంగిపోతాడు.

ఆందోళనకు గురైతే శారీరకంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కొందరు ఆన్‌లైన్‌లో తమ ఆరోగ్య సమస్యలు వెతికి ముందుగానే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకుని డాక్టర్‌ వద్దకు వెళ్తున్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.

ఒక్కో వ్యక్తికీ ఒక్కో శరరీతత్వం ఉంటుంది. వారి జన్యువులు, వారి ఆరోగ్యాన్ని బట్టి రోగ లక్షణాలు ఉంటాయి. అందరినీ ఒకే విధంగా చూడలే మని వైద్యులు చెబుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన చికిత్స ఉంటుందని, ఆన్‌లైన్‌ వైద్యాన్ని గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ1
1/3

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ2
2/3

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ3
3/3

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement