
కచ్చితమైన సమాచారం ఉండదు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే వారు, యువతలో ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఆరోగ్య విషయాలు బ్రౌజ్ చేయడం చేస్తుంటారు. నెట్‌లో కొన్ని నమ్మకమైన వెబ్‌సైట్లు, యాప్స్ మినహా అన్నింటిలోనూ కచ్చితమైన సమాచారం ఉండదు. కచ్చితత్వంలేని సమాచారాన్ని చదివితే మనసు మరింత ఆందోళనకు గురవుతుంది. ఆరోగ్య సమస్యల వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేగానీ ప్రతి విషయానికీ ఆన్‌లైన్‌పై ఆధారపడటం మంచిది కాదు.
–డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్‌వోడి,
సైకియాట్రి విభాగం, జీజీహెచ్, కర్నూలు
వైద్యులను నేరుగా
సంప్రదించాలి
ఇటీవల ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ముందుగా ఆన్‌లైన్‌లో వెతకడం ఎక్కువైంది. అందులో వచ్చిన సమాచారాన్ని చూసి మరింత ఆందోళనకు గురై మా వద్దకు వస్తున్నారు. కొందరైతే ఆన్‌లైన్‌లో వెతికి అందుకు అనుగుణంగా అన్ని రకాల పరీక్షలు చేయించుకుని వస్తున్నారు. టెస్టుల్లో కొన్ని అబ్‌నార్మల్ చూపిస్తాయి. వాటిని చూసి టెన్షన్ పడుతుంటారు. కొన్ని అబ్‌నార్మల్ ఉన్నా ఎలాంటి లక్షణాలు లేకపోతే ఏమీ కాదు. ఆన్‌లైన్ వైద్యాన్ని నమ్ముకోకుండా వైద్యులను నేరుగా సంప్రదించి చికిత్స తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.
–డాక్టర్ మీనుగ శ్రీనివాసులు,
జనరల్ ఫిజీషియన్, జీజీహెచ్, కర్నూలు
●

కచ్చితమైన సమాచారం ఉండదు