పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు

May 25 2025 8:10 AM | Updated on May 25 2025 8:10 AM

పారిశ

పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు

20 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు

కర్నూలు(అర్బన్‌): గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్‌ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల మూడవ వారంలో ఇంటింటి చెత్త సేకరణకు సంబంధించి నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో జిల్లాలోని 20 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారన్నారు. ఈ నేఫథ్యంలో ఆయా పంచాయతీల కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. తాగునీటి పైప్‌లైన్లు ఎక్కడైనా పాడైపోయి ఉంటే వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమన్వయంతో ఆయా పైప్‌లైన్లను బాగు చేయించి రక్షిత నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు.

జూన్‌ 1 నుంచి రేషన్‌ షాపుల్లోనే సరుకులు

కర్నూలు(సెంట్రల్‌): జూన్‌ 1వ తేదీ నుంచి రేషన్‌ షాపుల్లోనే బియ్యం, బ్యాళ్లు, చక్కెర ఇతర సరుకులను పంపిణీ చేయాలని జేసీ డాక్టర్‌ బి.నవ్య డీలర్లను ఆదేశించారు. శనివారం ఆమె జి.సింగవరం, కల్లూరులోని రేషన్‌ షాపులను ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్‌ 1 నుంచి ఎండీ యూ వాహనాల ద్వారా కాకుండా రేషన్‌షాపుల్లో నే సరుకులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు మాత్రమే డోర్‌ డెలివరీ చేయిస్తామన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు షాపుల్లోనే ఈపాస్‌ మిషన్ల ద్వారా సరుకు లు పంపిణీ చేయాలన్నారు. జేసీ వెంట కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌ రమేష్‌బాబు పాల్గొన్నారు.

హైకోర్టు జడ్జిని కలసిన కలెక్టర్‌

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డిని కలెక్టర్‌ రంజిత్‌బాషా మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆతిథి గృహంలో ఉన్న జడ్జిని కలెక్టర్‌ కలసి పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా పరిస్థితులను వివరించారు.

16 మంది డిబార్‌

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సెమిస్టర్‌ పరీక్షలకు 1,181 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు 10,775 మందికి 9,616 మంది హాజరు కాగా 1,159 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. 6వ సెమిస్టర్‌ స్పెషల్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 207 మందికి 185 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. చూచిరాతలకు పాల్పడిన 16 మంది విద్యార్థులను గుర్తించి డిబార్‌ చేసినట్లు పేర్కొన్నారు.

సీలింగ్‌ ఎత్తివేయాలి

కర్నూలు సిటీ:ఉపాధ్యాయుల బదిలీల్లో స్టేషన్‌ పాయింట్స్‌పై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేయాలని ఏపీటీఎఫ్‌(257) ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శని వారం డీఈఓ ఎస్‌.శామ్యూల్‌పాల్‌ను కలిసి విన్న వించారు. 2014 డీఎస్సీ ఉపాధ్యాయులు కౌతా ళం, కోసిగి, హొళగుంద మండలాల్లో సుమారు తొమ్మిది సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. అయితే ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రస్తుతం దర ఖాస్తు చేసుకుంటే స్టేషన్‌ పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే కేటాయించడం వల్ల తీరని అన్యా యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓను కలసిన వారిలో జిల్లా ప్రధాన కార్య దర్శి రంగన్న, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

పారిశుద్ధ్యం లోపిస్తే  చర్యలు తప్పవు 1
1/2

పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు

పారిశుద్ధ్యం లోపిస్తే  చర్యలు తప్పవు 2
2/2

పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement