
గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి
నందవరం/గోనెగండ్ల: వివిధ దశలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించాలని హౌసింగ్ పీడీ చిరంజీవి ఆదేశించారు. శనివారం నాగలదిన్నె, హాలహర్వి గ్రామాల్లో వివిధ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పీడీ పరిశీలించారు. అనంతరం హౌసింగ్ లబ్ధిదారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో 192 ఇళ్లు వివిధ దశల్లో పెండింగ్ ఉన్నాయని, అందులో 82 గృహలు పూర్తి చేశారని, మిగిలినవి బీఎల్, ఎల్‌ఎల్, ఆర్‌ఎల్, ఆర్పీ లెవల్ ఉన్నాయని వివరించారు. వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే థర్డ్ పార్టీ నిర్మించిన ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. వివిధ దశలో పూర్తి నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లు చెల్లిస్తామని తెలిపారు. అలాగే గోనెగండ్ల మండలంలోని కులుమాల, హెచ్. కై రవాడి, చిన్న నేలటూరు, అలువాల గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓలు పుల్లయ్య, మణిమంజరి, హౌసింగ్ డీఈ ప్రసాద్, ఏఈలు వెంకటేష్, షేక్షావలి, డిప్యూటీ ఎంపీడీఓ సందీప్ ఉన్నారు.