
రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం
కర్నూలు (టౌన్): రియల్ ఏస్టేట్ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలో క్రెడాయ్ ప్రాపర్టీ ప్రదర్శన నిర్వహించారు. మంత్రి భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. ఓర్వకల్లులో పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, అక్కడ స్టార్ హోటళ్లను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలు ఈ ప్రదర్శనను వినియోగించుకోవాలన్నారు. క్రెడాయ్ అధ్యక్షుడు, కన్వీనర్, చైర్మన్ సురేష్‌కుమార్ రెడ్డి శ్రీనివాసరావు, గోరంట్ల రమణ మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ప్లాట్లు, నిర్మాణ సంస్థలు, ఇంటీరియర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, బ్యాంకింగ్ సంస్థలను ఈ ప్రదర్శనలో ఉంచామన్నారు. ఇంటి కోనుగోళ్లకు రుణసౌకర్యం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అనంతరం మంత్రి స్టాళ్లను సందర్శించారు. నగర మేయర్ బీవై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, క్రెడాయ్ సంస్థ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి టీఏవీ ప్రకాష్, రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.