
ఆధార్ అప్‌డేట్.. సర్వర్ బిజీ!
హాలహర్వి: ఆధార్ సేవల కోసం వెళితే సర్వర్ బిజీ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ప్రస్తుతం బాపురం గ్రామంలో మాత్రమే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ–కేవైసీ, కొత్త రేషన్‌కార్డుల కోసం చిన్నారుల అప్‌డేట్, పెద్దవారు అప్‌డేట్ కోసం ఆధార్ కార్డు ప్రతిఒక్కరికీ తప్పనిసరి అయ్యింది. చిన్నారులకు కొత్త ఆధార్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలాఉండగా బాపురం గ్రామంలో మాత్రమే ఆధార్ అప్‌డేట్ సెంటర్ ఉండడంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అక్కడ సర్వర్ బిజీ వల్ల పనులు జరగడం లేదు. ఒక ఆపరేటర్ మాత్రమే ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారు. దీంతో గంటల కొద్దీ ప్రజలు కార్యాలయం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి మండల కేంద్రమైన హలహర్వి, గూళ్యం, చింతకుంట లాంటి పెద్ద పంచాయతీల్లో కూడా ఆధార్ అప్‌డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న ప్రజలు