
మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు
మహానంది: మహానందీశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్, ఐజీ, ఐపీఎస్ రాహుల్‌దేవ్ శర్మ, ఈఎస్ రవికుమార్, కర్నూలు కోర్టు 7వ అదనపు జిల్లా జడ్జి వి.లక్ష్మీరాజ్యం, రామశర్మ దంపతులు, సీఐ కష్ణమూర్తి, నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్ రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు కామేశ్వరి దేవి, మహానందీశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. దర్శనం అనంతరం స్థానిక అలంకార మండపంలో వేద పండితులు, అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందించి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
బీసీ భవన్ స్థల పరిశీలన
కర్నూలు(అర్బన్): నగరంలోని బీ క్యాంప్ పరిసరాల్లో బీసీ భవన్‌కు కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ పరిశీలించారు. శుక్రవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన ఆయన్ను స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో పలువురు బీసీ నాయకులు కలిసి నిర్మాణ దశలో ఆగిపోయిన బీసీ భవన్‌ను పరిశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీసీ భవన్ స్థలాన్ని పరిశీలించి, భవనం పూర్తి చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ నేపథ్యంలో నగరంలోని బీసీ స్టడీ సర్కిల్‌కు హాస్టల్ మంజూరు చేయాలని, ఉమ్మడి జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ నాయకులు కోరారు. అలాగే బీసీ కులాలకు చెందిన వివిధ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే.ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్.జాకీర్‌హుసేన్, సహాయ బీసీ సంక్షేమాధికారి శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, నాయకులు ఉప్పరి శివన్న, పీజీ వెంకటేష్ తదితరులు ఉన్నారు.

మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు