
శ్వేత వర్ణంతో ఆనందిం‘చేను’
భానుడు భగభగ మంటున్నాడు.. ఎండలు మండుతున్నాయి.. నెత్తిమీద టవాల్ వేసుకుని రైతులు బయటకు వెళ్లాల్సి వస్తోంది. అయితే పొలంలో ఉండే పంట పరిస్థితి ఏమిటని రైతు మద్దిలేటి రెడ్డి ఆలోచించాడు. ఎండలకు పంట దెబ్బతినకుండా, తెగుళ్లబారిన పడకుండా వినూత్న ప్రయోగం చేశారు. కాయల నాణ్యత తగ్గకుండా తోటలో దానిమ్మ చెట్లకు గ్రో కవర్ తొడిగారు. దీనిని గుజరాత్ నుంచి తెప్పించారు. ఎకరాకు 10 టన్నులు దిగుబడి వస్తుందని, పెట్టుబడికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని రైతు చెప్పారు. తుగ్గలి మండలం తువ్వదొడ్డి గ్రామ సమీపంలో మొత్తం 10 ఎకరాల్లో దానిమ్మ తోట శ్వేత వర్ణంతో అందరినీ ఆకర్షిస్తోంది. – తుగ్గలి