
ఏపీటీఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గంలో ముగ్గురికి చోటు
కర్నూలు కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ (ఏపీటీఎస్‌ఏ) రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి ముగ్గురు సబ్ ట్రెజరీ ఆఫీసర్స్ (ఎస్‌టీవో)లకు స్థానం లభించింది. ఆదివారం విజయవాడలో ఏపీఎస్‌టీఏ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీహెచ్ వెంగళ్ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా ట్రెజరీలో ఎస్‌టీవోగా పనిచేస్తున్న మురళీధర్ నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లా ట్రెజరీ ఎస్‌టీవో కరుణాకర్, డోన్ ఎస్‌టీవో రఘునందన్ కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గంలో స్థానాలు దక్కించుకున్న ఎస్‌టీవోలకు ట్రోజరీ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.