
భారీ అగ్ని ప్రమాదం
డోన్ టౌన్: పట్టణంలోని కంబాలపాడు సర్కిల్ వద్ద ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పక్కన శ్రీరాఘవేంద్ర ఎలక్ట్రానిక్స్ షాపులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. మూసివున్న షాపు నుంచి ఉదయం 4.30 గంటల సమయంలో పోగలు వస్తుండటం గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేసుకుని మంటలను అదుపు చేశారు. షాపులో ఎలక్ట్రానిక్ వస్తువులు కావడంతో మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఫైర్ ఇంజిన్‌తో పాటు రెండు ట్రాక్టరు ట్యాంకర్లతో నీటిని అందుబాటులో ఉంచుకుని మంటలను అదుపు చేసేలోపు ఉదయం 10 గంటలైంది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, ఎయిర్ కూలర్లు, టాటా స్కై, వాటర్ ఫిల్టర్లు, ఫ్ల్యాన్లతో పాటు పలు ఎలక్రానిక్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో చుట్టపక్కల దట్టమైన పగ కమ్ముకోవడంతో సమీప దుకాణాల యజమానులు భయాందోళన చెందారు.
ప్రమాదంపై పలువురి ఆరా..
పట్టణానికి చెందిన ఆర్య వైశ్యుడు నగేష్ గుప్త 40 ఏళ్ల క్రితం బైసాని కృష్ణమూర్తికి చెందిన షాపును అద్దెకి తీసుకుని మొట్టమొదట డోన్‌లో అతి పెద్ద టీవీల షాపు ప్రారంభించారు. ఇటటీవల ఆయన మరణించగా కుమారుడు కిశోర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్‌లో చదువుతున్న కూతురిని చూసేందుకని కిశోర్ శుక్రవారం రాత్రి వెళ్లగా శనివారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడ్, చైర్మన్ సప్తశైల రాజేష్‌తోపాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు అక్కడికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీస్తూ సానుభూతి వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా అగ్నిమాపక అధికారి బాలరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి డోన్ అగ్నిమాపక కేంద్రం అధికారి రంగస్వామి గౌడ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు బుగ్గి
రూ.50 లక్షల నష్టం

భారీ అగ్ని ప్రమాదం