
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
ఆస్పరి: మండల కేంద్రమైన ఆస్పరి సమీపంలో శనివారం ఆటోను స్కూటర్ ఢీకొట్టడంతో కోసిగికి చెందిన కోసిగమ్మ (50) దుర్మరణం చెందగా స్కూటరిస్టు మహమ్మద్ జాకీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సీఐ మస్తాన్‌వలి తెలిపిన వివరాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న బంధువులను పరామర్శించేందుకని కోసిగికి చెందిన కోసిగమ్మతోపాటు మరో ఆరుగురు ఆటోలో పత్తికొండకు వెళ్లారు. పరామర్శించిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఆస్పరి సమీపంలోకి రాగానే ఆస్పరిలోని ఓ డాబాలో పనిచేస్తున్న బిహార్ యువకుడు మహమ్మద్ జాకీర్ బైక్‌పై పత్తికొండ వైపు వెళ్తూ ఆటోను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆటో చివరలో కూర్చున్న కోసిగమ్మ ఎగిరి కింద పడి తీవ్రంగా గాయపడింది. స్కూటరిస్టు మహమ్మద్ జాకీర్ సృహ తప్పి పడిపోయాడు. ఇద్దరినీ ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో కోసిగమ్మ మృతిచెందింది. ప్రథమ చికిత్స అనంతరం మహమ్మద్ జాకీర్‌ను ఆదోనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కోసిగమ్మ సోదరుడు కోసిగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి గతంలోనే భర్త మృతిచెందగా ఇద్దురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
స్కూటరిస్ట్‌కు తీవ్రగాయాలు

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి