
ఈత కొలనులో విషాదం
● నీట మునిగి ఐదేళ్ల బాలుడు మృతి
ఆదోని అర్బన్: ఈత కొలనులో నీట మునిగి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఇస్వీ గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఇస్వీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన రవి, రీటా దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గురువారం ఉదయం ఇస్వీ గ్రామ సమీపంలో ఉన్న ఈత కొలనుకు ముగ్గురు కుమారులతో కలిసి తల్లిదండ్రులు వెళ్లారు. తల్లి రీటా తన రెండో కుమారుడు దుస్తులు మారుస్తుండగా తండ్రి బెలూన్ తేవడానికి వెళ్లాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా పెద్ద కుమారుడు ప్రిన్స్ (5) ఈతకొలనుతో దూకాడు. కాళ్లు, చేతులు ఆడించినా నీటిలో మునిగిపోయాడు. పది నిమిషాల తర్వాత తల్లిదండ్రులు ప్రిన్స్ ఎక్కడికి వెళ్లిపోయాడని వెతుకుతుండడంతో ఈత కొట్టే వ్యక్తి విషయాన్ని తెలిపారు. ఈత కొలను నుంచి ప్రిన్స్‌ను బయటకు తీసి వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అప్పటికే ప్రిన్స్ మృతి చెందాడని తెలిపారు.
కోలుకోలేక ఏఆర్ కానిస్టేబుల్ మృతి
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిన్నికృష్ణ (35) గడ్డిమందు తాగి గత ఏప్రిల్ 25 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కోలుకోలేక గురువారం మరణించారు. ఉద్యోగ రీత్య స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లో నివాసముంటున్న చిన్నికృష్ణ ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. ఈనేపథ్యంలో నంద్యాల శివారులో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకోలేక గురువారం మృతి చెందినట్లు తాలుకా పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం.
ఆర్‌యూలో ఘర్షణ
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. గురువారం వర్సిటీలోని ఫోర్త్ బిల్డింగ్ సమీపంలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు, బోధనేత ర ఉద్యోగి ఒకరికొకరు వాగ్వాదం చేసుకున్నా రు.ఘర్షణ తీవ్రం కావడంతో పరస్పరం దూషి ంచుకుంటూ దాడి చేసుకున్నారు. తర్వాత ఇరువురు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడుకు ఫిర్యాదు చేశారు.

ఈత కొలనులో విషాదం