
బంగారు దుకాణంలో చోరీ
పత్తికొండ రూరల్:పత్తికొండ–గుత్తి రోడ్డు కూడలిలో మెయిన్ రోడ్డులో ఉన్న బంగారు దుకాణంలో చోరీ జరిగింది. దూదేకొండ గ్రామానికి చెందిన పింజరి అక్బర్ సాహెబ్ గత 13 ఏళ్లుగా పత్తికొండ పట్టణంలో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. వెండి, బంగారు ఆభరణాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి షాపునకు తాళం వేసి సొంతూరుకు వెళ్లాడు. బుధవారం ఉదయం షాపు తెరిచి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు పైకప్పు తొలగించి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. షాపులోని లాకర్‌లో ఉంచుకున్న 8 జతల బంగారు కమ్మలు, ఒకటిన్నర కేజీల వెండి ఆభరణాలతో పాటు రూ.3 లక్షల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దుకాణాన్ని స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలు సేకరించినట్లు సీఐ జయన్న తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

బంగారు దుకాణంలో చోరీ