
ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు
మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో దశలవారీగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24, 25వ తేదీల్లో విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీహెచ్‌వోలందరూ మహాధర్నాలో పాల్గొన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇందులో భాగంగా నిరవధిక సమ్మె చేస్తూ శాంతియుత పద్ధతిలో ఆందోళనకు దిగాం.
– టీఎస్. చందన, ఏపీ ఎంఎల్‌హెచ్‌పీ/
సీహెచ్‌వో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు
సీహెచ్‌వోలను
క్రమబద్ధీకరించాలి
ఆరేళ్లు దాటిన సీహెచ్‌వోలను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా చేయడం లేదు. ఎన్‌హెచ్‌ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు తీర్చే విధంగా హామీ ఇవ్వాలి. ఈ డిమాండ్లు తీర్చేవరకు మేము శాంతియుత నిరసనలు కొనసాగిస్తాం.
–కె.నాగరాజు, ఏపీ ఎంఎల్‌హెచ్‌పీ/సీహెచ్‌వో అసోసియేషన్ జిల్లా కోశాధికారి, కర్నూలు

ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు