టిప్పర్‌ కింద పడి వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ కింద పడి వ్యక్తి దుర్మరణం

Mar 23 2025 1:02 AM | Updated on Mar 23 2025 1:01 AM

బేతంచెర్ల: ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గూడూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన కురువ సుధాకర్‌, తన సోదరుడు కుమారుడు శివతో కలిసి మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి బైక్‌పై వచ్చారు. స్వామి దర్శనం అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పి కింద పడటంతో టిప్పర్లు టైర్ల కురువ సుధాకర్‌ (44)పై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరు కుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రాణం తీసిన విద్యుదాఘాతం

ఆదోని అర్బన్‌: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ దుర్ఘటన శనివారం ఆదోని మండలం సాదాపురం గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన 16 మంది ఆదోని మండలం సాదాపురం గ్రామంలో త్రీఫేజ్‌ విద్యుత్‌ లైనింగ్‌ పనులు చేస్తున్నారు. రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా.. ఒకదానిని మాత్రమే ఆఫ్‌ చేశారు. రెండో ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్‌ చేయకుండా పనులు చేస్తుండగా.. జార్ఖండ్‌ రాష్ట్రంలోని లోడాసోయి గ్రామానికి చెందిన జయరామ్‌పార్థర్‌(24) విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నట్లు పోలీసులు చెప్పారు.

ఈతకు వెళ్లి బాలుడి మృతి

కోడుమూరు రూరల్‌: ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒక బాలుడు నీటమునిగి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం పులకుర్తి గ్రామంలో చో టు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యన్న, మల్లీశ్వ రీ దంపతుల పెద్ద కుమారుడు వరుణ్‌తేజ్‌ (7) కోడుమూరులోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే ఒంటిపూ ట బడులు కావడంతో శనివారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఊరికి వెళ్లాడు. ఇంటి సమీపంలో ఉన్న సుంకులమ్మ వంకకు బాలుడు ఈతకు వెళ్లాడు. అయితే ఈత సరిగా రాకపోవడం, వంక లోతుగా ఉండడంతో వరుణ్‌తేజ్‌ నీటిలో మునిగిపోయాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో బాలుడు నీట మునిగి మృతిచెందాడు. కూలి పనికి వెళ్లి వచ్చిన తండ్రి కుమారుడి కోసం వెత కగా వంకలో మృతదేహం కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు నీట ము నిగి మృతిచెందడంతో అప్పుడే నూరేళ్లు నిండా యా నాన్న అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. బాలుడు నీట మునిగి మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

టిప్పర్‌ కింద పడి  వ్యక్తి దుర్మరణం 1
1/1

టిప్పర్‌ కింద పడి వ్యక్తి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement