గత ఏడాది పండించిన మిర్చి ఇప్పటికీ గోదాముల్లో ఉంది. ఈ సారి 3.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.1.50 లక్షల వరకు వస్తోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి ధర కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లభిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 20 క్వింటాళ్లు తాలు కాయలే. ప్రస్తుతం దళారీలు క్వింటా రూ.10 వేల చొప్పున అడుగుతున్నారు. ఈ ధరతో అమ్ముకుంటే పెట్టుబడి కూడా దక్కదనే భయంతో ఏసీ గోదాముల్లో నిల్వ చేశాం.
– ఎర్ర చిన్న సతీష్, బసలదొడ్డి, పెద్దకడుబూరు మండలం
క్వింటాకు రూ.10 వేల వరకే ధర