భక్త కనకదాసు గొప్ప తత్వవేత్త | - | Sakshi
Sakshi News home page

భక్త కనకదాసు గొప్ప తత్వవేత్త

Nov 19 2024 2:11 AM | Updated on Nov 19 2024 2:10 AM

కర్నూలు(అర్బన్‌): తన కీర్తనల ద్వారా భక్తి తత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని బోధించిన గొప్ప తత్వవేత్త భక్త కనకదాసు అని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు. సోమవారం భక్త కనకదాసు జయంతి సందర్భంగా స్థానిక బీ క్యాంప్‌లోని బీసీ భవన్‌ ఎదురుగా ఉన్న భక్త కనకదాసు విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారిణి పీ వెంకటలక్షుమ్మ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ జాకీర్‌హుసేన్‌, కురువ కార్పొరేషన్‌ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటరాముడు, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జయంతి సభను నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భక్త కనకదాసు సైన్యంలో కూడా పనిచేసి యుద్ధంలో గాయపడి తదు పరి భక్తి మార్గంలో అనేక కీర్తనలు, రచనలను చేసి సమాజానికి అందించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు, ఆయా సంఘాల నేతలు నక్కలమిట్ట శ్రీనివాసులు, శ్రీనివాసులు, ఎంకే మద్దిలేటి, నాయకులు తిరుమలేష్‌, మల్లికార్జున, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement