గాంధీనగర్‌లో రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న గోడ
బేతంచెర్ల: పట్టణంలోని బనగానపల్లె రైల్వే గేట్ల వద్ద రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. సంజీవనగర్ కాలనీకి చెందిన నాగరాజు (60) ఆదివారం డోన్ క్రాస్ రోడ్డులో ఉన్న తన దుకాణానికి వెళ్లే క్రమంలో గేట్లు దాటుతుండగా నంద్యాల వైపు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ప్రమాదంలో మృతుడి శరీర భాగాలు రైలు పట్టాల వెంట చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు కుటుంబ సభ్యులకు, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీఆర్‌పీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం
● వివాదాస్పదంగా మారిన స్థల పంచాయతీ
కోవెలకుంట్ల: పట్టణంలోని గాంధీనగర్‌కు వెళ్లే రహదారిలో స్థల పంచాయతీ వివాదాస్పదంగా మారింది. ఆదివారం ఇంటి యజమాని ఏకంగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణ పనులు చేపట్టాడు. కాలనీ ఏర్పాటైనప్పటి నుంచి గాంధీనగర్‌కు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. గ్రామ పంచాయతీ అధికారులు ఈ ప్రాంతంలో సీసీరోడ్డును ఏర్పాటు చేశారు. అయితే స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలో ఇరువురు వ్యక్తులకు ఉన్న ఇల్లు, స్థలానికి సంబంధించి కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గాంధీనగర్‌లోకి వెళ్లేందుకు రోడ్డు లేదని ఆ స్థలమంతా తననేనంటూ ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ దారి మార్గాన వెళుతున్నామని, గ్రామ పంచాయతీ అధికారులు వేసిన రోడ్డుకు అడ్డంగా గోడను ఎలా నిర్మిస్తారని కాలనీ వాసులు ప్రతిఘటించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోడ నిర్మాణంపై గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు.
నాగరాజు (ఫైల్)


