శాకంబరీ.. | - | Sakshi
Sakshi News home page

శాకంబరీ..

Jul 28 2026 5:17 AM | Updated on Jul 28 2026 5:17 AM

మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026 ప్రణామమమ్మా అంటూ భక్తితో కొలిచిన భక్తజనం సారొచ్చారు.. వర్షాల కోసం వరుణయాగం ఈవీఎం గోడౌన్‌ తనిఖీ –8లోu రైళ్లలో అదనపు లగేజీ కోసం ఆన్‌లైన్‌ సదుపాయం

న్యూస్‌రీల్‌

ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం భక్తులకు దర్శన అనంతరం కదంబ ప్రసాదం పంపిణీ కొనసాగిన సారె సమర్పణలు

భక్తులకు కదంబ ప్రసాదం..

కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026
ప్రణామమమ్మా అంటూ భక్తితో కొలిచిన భక్తజనం

7

మంత్రి నారా లోకేష్‌ కంకిపాడు మండల పర్యటన ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తెచ్చిపెట్టింది. గంటల తరబడి ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభించింది.

గంపలగూడెం: నెమలిలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకుడు టి. గోపాలచార్యులు ఆధ్వర్యంలో వరుణజపం, వరుణయాగం నిర్వహించారు.

చిలకలపూడి(మచలీపట్నం): భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తనిఖీ చేశారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునేటప్పుడే తమ వ్యక్తిగత లగేజీని కూడా బుక్‌ చేసుకునేందుకు వీలుగా భారతీయ రైల్వే కొత్త ఆన్‌లైన్‌ సదుపాయం కల్పించింది. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే సమయంలోనే నిర్ధేశించిన పరిమితి వరకు తమ అదనపు లగేజీలను కూడా బుక్‌ చేసుకునే వీలుంటుంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని ఈ నెల 31 నుంచి ప్రయాణికులకు అందు బాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు ఉచిత పరిమితి మించి లగేజీలను తీసుకువెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు స్టేషన్‌లోని బుకింగ్‌ కార్యాలయానికి వెళ్లి అదనపు లగేజీలను బుక్‌ చేసుకుని అవసరమైన రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఒక వేళ ప్రయాణికుడు పరిమితికి మించి లగేజీ బుక్‌ చేయకుండా ప్రయాణం చేస్తే టీటీఈ ద్వారా జరిమానా విధించేవారు. కొత్త విధానంతో ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ ద్వారా ధ్రువీకరించిన రిజర్వ్‌డ్‌ టికెట్‌తో పాటు అర్హత కలిగిన వ్యక్తిగత లగేజీని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌ పక్రియలో ప్రయాణికులకు కావాల్సిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచారు. వారు తీసుకువెళ్లాల్సిన ఉచిత లగేజీ బరువు, నిషేధిత లగేజీల వివరాలతో పాటు బుక్‌ చేయని లగేజీలను తీసుకువెళితే వర్తించే జరిమానా వంటి వివరాలు అందులో ఉంటాయి. దీని వలన ప్రయాణికులు నిర్ధేశించిన పరిమితులకు అనుగుణంగా తమ లగేజీలను ప్లాన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

లగేజీల వివరాలు..

● ఏసీ ఫస్ట్‌ క్లాస్‌లో ఉచిత లగేజీ 70 కేజీలు ఉండగా అదనంగా 150 చేజీల వరకు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

● ఏసీ 2టైర్‌లో ఉచిత లగేజీ 50 కేజీలు ఉండగా 100 కేజీలకు వరకు బుక్‌ చేసుకోవచ్చు.

● 3 టైర్‌/ఏసీ 3 ఎకానమీ/ ఏసీ చైర్‌ కార్‌లో ఉచిత లగేజీ పరిమితి 40 కేజీలు మాత్రమే.

● స్లీపర్‌ క్లాస్‌లో ఉచిత లగేజీ 40 కేజీలు ఉండగా దాన్ని 80 కేజీల వరకు పెంచారు.

● సెకండ్‌ క్లాస్‌లో ఉచిత లగేజీ 35 కేజీలు ఉండగా అదనంగా 70 కేజీల వరకు అనుమతించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారిని ఆకుకూరలు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్‌తో అలంకరిస్తారు. తొలి రోజున అమ్మవారి ప్రధాన మూలవిరాట్‌తో పాటు మహా మండపం ఆరో అంతస్తు, ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లోని పరివార దేవతలకు ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను అలంకరించేందుకు సుమారు 20 టన్నుల కూరగాయలను వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

పూజా సామగ్రిగా కూరగాయల దండలు..

శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు పూజా సామగ్రికి బదులుగా ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసిన దండలను అమ్మవారికి సమర్పించడం కనిపించింది. సారె, పూజా సామగ్రితో పాటు ఆకుకూరలు, కాయగూరలను మూల విరాట్‌తో పాటు ఉత్సవ మూర్తికి సమర్పించారు.

ఆకట్టుకున్న కూరగాయల ప్రతిమలు..

రాజగోపురం ఎదుట కూరగాయలతో చేసిన ఆకృతులు, ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజగోపురం ఎదుట చిన్న అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద కరివేపాకుతో భారీ చెట్లను తీర్చిదిద్దారు. ఇక ట్రస్ట్‌బోర్డు సభ్యుల చాంబర్‌ ఎదుట, చైర్మన్‌ చాంబర్‌ ఎదుట ఏర్పాటు చేసిన ప్రతిమలు అలరించాయి. ఆయా ప్రతిమల వద్ద భక్తులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కనిపించారు.

పలు జిల్లాల నుంచి వితరణగా..

పలు జిల్లాల నుంచి ఆకుకూరలు, కాయగూరలను రైతులు, హోల్‌సేల్‌ వ్యాపారులు అమ్మవారికి సమర్పించారు. విజయవాడ నున్నలోని శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌, కేదారేశ్వరపేట హోల్‌సేల్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌, గుంటూరు ఆకుకూరల మార్కెట్‌, నారా కోడూరులోని కూర గాయల వ్యాపారులు, యడ్లవల్లి రైతులు, సంగం జాగర్లమూడి రైతులు, వట్టిగుడిపాడు, కొత్తపేట, ఏలూరు, తణుకు, సిద్ధాంతం, మడికి, నూజివీడు, చిన్న ఓగిరాల, పెద్ద ఓగిరాలకు చెందిన రైతులు కూరగాయలను అందజేశారు.

కొంత వరకే అలంకరణలు..

శాకంబరీ ఉత్సవాలతో రాజగోపురం, ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున కూరగాయల దండలను అలంకరించారు. అయితే భక్తులు ఎక్కువగా కొండపైకి నడుచుకుంటూ వచ్చే ఘాట్‌రోడ్డు మార్గంలోని లక్ష్మీగణపతి ప్రాంగణం, చిన్న గాలిగోపురం, నటరాజస్వామి వారి ఆలయం, నాగేంద్ర పుట్ట పరిసరాల్లో కూరగాయల దండలు కనిపించలేదు. మరో వైపున ఆయా పరిసరాల్లో ప్లాస్టిక్‌ డబ్బాలు, అరుగుపై సిద్ధం చేసిన కూరగాయల దండలను వదిలేయడంతో భక్తులు వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు.

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న

జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌, ఇతర అధికారులు

సీఎం చంద్రబాబునాయుడుతో

డొక్కుమాల శ్రీకాంత్‌(ఫైల్‌)

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో

కటికల కల్యాణ్‌(ఫైల్‌)

ఆషాఢ మాసం నేపథ్యంలో సారె సంబరం కొనసాగుతోంది. సోమవారం 27కు పైగా భక్త బృందాలు, సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నూతన పూజా మండపం వద్ద భక్తులకు కదంబ ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ఈవో శీనానాయక్‌, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్‌ కదంబ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం నూతన పూజా మండపం వద్దకు చేరుకున్న భక్తులు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. కుటుంబ సభ్యులతో పిల్లాపాపలతో కలిసి కదంబ ప్రసాదాన్ని స్వీకరించడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement