మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న వాహనానికి ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న వాహనానికి ప్రమాదం

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న వాహనానికి ప్రమాదం పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అస్వస్ధతకు గురైన ఘటన సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండమోడు – పేరేచర్ల రహదారి విస్తరణలో భాగంగా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపునకు బేబీ చిప్స్‌తో వస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద వాహనాన్ని నెమ్మదిగా నడుపుతుండగా వెనుక నుంచి 50 మంది ప్రయాణికులతో గుంటూరు స్వర్ణ భారతి నగర్‌ నుంచి మొక్కు తీర్చుకోవడం కోసం దామరచర్ల గ్రామం గండి మైసమ్మ దేవాలయానికి ప్రయాణమైన భక్తుల డీసీఎం లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం లారీ వాహనం ముందు క్యాబిన్‌ ధ్వంసమై క్యాబిన్‌లో కూర్చున్న ఓర్చు వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు విరగ్గా, ఓర్చు యేసురాజుకు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓర్చు రమణమ్మకు ఛాతీలో నొప్పి అధికమై అస్వస్థతకు గురైంది. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాళ్లు విరిగిన వెంకటేశ్వర్లు, యేసురాజులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇది ఇలా ఉంటే డీసీఎం లారీ వాహన డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు బాధితులు వాపోయారు. ఇరువాహనాల డ్రైవర్లు పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు

చిలకలూరిపేటటౌన్‌: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్‌ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్‌ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇరువురికి తీవ్ర గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement