క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

గూడూరు: విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్‌ రంగబాబు కోరారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్‌ ద్వారా గూడూరు హైస్కూల్లో నిర్వహిస్తున్న వేసవి హాకీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం జరి గింది. ఈ సందర్భంగా మచిలీపట్నం– గూడూరు మండలం బాల, బాలికల జట్ల హాకీ పోటీలు గూడూరు హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ ఝాన్సీ లక్ష్మి, గూడూరు హకీ క్లబ్‌ అధ్యక్షుడు మొటేపల్లి రత్నారావుతో కలిసి జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌ రంగబాబు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ గూడూరు హాకీ క్లబ్‌ ఆధ్వర్యాన జాతీయ క్రీడ హాకీని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. నిబద్ధతతో వేసవి హాకీ శిబిరాన్ని కొనసాగించిన జిల్లా స్పోర్ట్స్‌ సెక్రటరీ మత్తి అరుణ, హాకీ కోచ్‌ హరికృష్ణను ఆయన అభినందించారు. గూడూరు హాకీ క్లబ్‌ అధ్యక్షుడు మోటేపల్లి రత్నారావు మాట్లాడుతూ గూడూరు హైస్కూల్‌ పరిధిలో హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దడానికి తమ క్లబ్‌ కృషి చేస్తుందన్నారు. డీఎస్‌డీఓ ఝాన్సీ లక్ష్మి, స్కూల్‌ గేమ్స్‌ జిల్లా కార్యదర్శి మత్తి అరుణ, హాకీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి, కోచ్‌ శ్రవణం హరికృష్ణ, గూడూరు హాకీ క్లబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఏ సలీమ్‌, సెక్రటరీ పెనుగొండ శ్రీనివాసరావు, బేగ్‌, స్టేట్‌ వెటరన్‌ అథ్లెట్‌ తోట విజయ్‌కుమారి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మచిలీపట్నం మండలం మధ్య జరిగిన హాకీ పోటీల్లో బాలిక విభాగంలో గూడూరు.. బాలుర విభాగంలో మచిలీపట్నం జట్లు విజయం సాధించాయి. విజేతలకు శిక్షణ పొందిన క్రీడా కారులకు రత్నారావు ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement