డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

ఇద్దరికి గాయాలు మొక్కు చెల్లించి తిరిగి వస్తుండగా ఘటన

కంచికచర్ల: అమ్మవారి సన్నిధిలో మొక్కు తీర్చుకునేందుకు వచ్చి తిరిగి బైక్‌పై ప్రయాణిస్తుండగా కంచికచర్ల మండలం సమీపంలోకి రాగానే బైక్‌.. డివైడర్‌ను ఢీకొనగా ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలైన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విశ్వనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారి పాలెం గ్రామం నుంచి బంధువులు, కుటుంబసభ్యులు 15మంది టాటాఏస్‌ వాహనం ద్వారా పెనుగంచిప్రోలులో కొలువైఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మను దర్శించుకుని, మొక్కలు తీర్చుకునేందుకు వచ్చారు.

వారిలో మిగిలిన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. మొక్కులు తీర్చుకుని తిరిగి వారి స్వగ్రామానికి బయలుదేరారు. ఆ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై బయలుదేరారు. కంచికచర్ల మండలం పరిటాలలోని నక్కలంపేట రోడ్డు సమీపంలోకి రాగానే వారు నడుపుతున్న బైక్‌ జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టింది. ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న శాంతిరాజు, రాజుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ వాహన సిబ్బంది గాయపడ్డవారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement