తప్పిన పెనుప్రమాదం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రామవరప్పాడు నుంచి కండ్రిక వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశావత్తూ బోల్తాపడింది. ఘటనలో అదృష్టవశావత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ 05 టీఎఫ్ 1839 లారీ రామవరప్పాడు మొదటి ఫ్లైఓవర్ ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇన్ హోటల్ బ్యాక్‌సైడ్ పుట్‌ఫాత్ మీదుగా విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. లారీ పెద్ద శబ్దం చేస్తూ బోల్తాపడింది. అదృష్టవశావత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రేన్ సాయంతో లారీను తొలగించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో లారీ బోల్తాపడటంపై స్థానికులు, వాహనచోదకులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


