రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్
పెనుగంచిప్రోలు: దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్థానిక మునేరు అవతల మామిడి తోటలో నిర్వహిస్తున్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ఎన్టీఆర్ జిల్లా రెండు రోజుల శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన చేస్తూ దేశాభి వృద్ధితో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అనంతరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, టీడీపీ జిల్లా అధికార ప్రఽతినిధి నలమోలు రామప్రసాద్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మునేరు అవతల మూడు రోడ్లు కలిసే చోట రింగ్ ఏర్పాటు చేయటంతో పాటు రెండు వైపుల డబుల్ రోడ్డు నిర్మించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్, దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ కమిటీ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


