తిరుమల ఎక్స్‌ప్రెస్‌ గుంతకల్‌ వరకు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ గుంతకల్‌ వరకు పొడిగింపు

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ గుంతకల్‌ వరకు పొడిగింపు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ఇప్పటి వరకు విశాఖపట్నం–కడప–విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18522/18521)ను ప్రయాణికుల డిమాండ్‌ మేరకు గుంతకల్‌ వరకు పొడిగిస్తూ రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. గుంతకల్లు–విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18522) మే 12 నుంచి, విశాఖపట్నం–గుంతకల్లు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521) మే 13 నుంచి రెగ్యులర్‌ సర్వీసుగా ప్రకటించారు.

రైలు షెడ్యూల్‌ ఇదీ..

విశాఖపట్నం–గుంతకల్లు (18521) ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 2.33కి గుంతకల్లులో చేరుకుంటుంది. అక్కడ నుంచి మరుసటి రోజు ఉదయం 7.03కి కడప, 7.38కి యర్రగుంట్ల, 8.10కి కొండాపురం, 8.33కి తాడిపర్తి, 9.13కి గుత్తి అక్కడ నుంచి 11.30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (18522) మధ్యాహ్నం 1.30 గంటలకు గుంతకల్లులో బయలుదేరుతుంది. అక్కడ నుంచి 1.55కి గుత్తి, 2.50కి తాడిపర్తి, 3.13కి కొండాపురం, సాయంత్రం 5.38కి కడప చేరుకుని, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దువ్వాడ, 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement