చిలకలపూడి(మచిలీపట్నం): కేడీసీసీ బ్యాంకు సేవలను పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో డిజిటలైజేషన్ చేసినట్లు ఆ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. బుధవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో డిజిటల్ సేవలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంక్ అన్ని సర్క్యులర్లను ఒకే పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే నూతన వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి వేగవంతంగా అందిస్తామన్నారు. ఈ పోర్టల్ ద్వారా సిబ్బంది, ఖాతాదారులు, సంబంధిత వర్గాలు బ్యాంక్ సర్క్యులర్లను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చునన్నారు. సీఈఓ శ్యామ్ మనోహర్, జీఎంలు చంద్రశేఖర్, రంగబాబు, డీజీఎం వరలమ్మ, ఏజీఎంలు వాసవి కుమారి, ప్రభా, శ్రీదేవి పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: అసభ్య ప్రవర్తనపై స్థానిక బీసీ కాలనీ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం పెనుగంచిప్రోలులో కేసు నమోదైంది. బండి ఆదినారాయణ అనే వ్యక్తి బాత్‌రూమ్‌లో మహిళల వీడియోలు తీస్తున్నాడని బీసీ కాలనీ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆదినారాయణ ఫోన్‌ను తనిఖీ చేయగా మొత్తం 6 నుంచి 8 మంది వరకు మహిళల ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.


