పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎంతో కీలకం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎంతో కీలకం

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

మంత్రి కొల్లు రవీంద్ర

చిలకలపూడి(మచిలీపట్నం): పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎంతో కీలకమైందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు క్షేత్రస్థాయిలో అన్ని విధాలా సక్రమంగా అమలయ్యేందుకు అందరూ బాధ్యత వహించి సహకారం అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జెడ్పీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పంచాయతీల్లో చక్కటి ఫలితాలు సాధించిన వారికి అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గ్రామ స్వరాజ్యం అంటే పారిశుద్ధ్యం, మంచినీళ్లు వంటి మౌలిక వసతులు, కల్పించడమే అన్నారు.

ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు..

ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కన్న కలలు గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలన్నారు. అనంతరం పంచాయతీరాజ్‌ శాఖలో విశేష ప్రతిభ చూపిన ఉద్యోగులకు మంత్రి, ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సంయుక్తంగా ప్రశంసా పత్రాలను అందజేశారు. జెడ్పీ సీఈవో, ఇన్‌చార్జ్‌ డీపీవో డాక్టర్‌ జె. అరుణ, డీఎల్‌పీవోలు రజావుల్లా, సంపత్‌ కుమారి, ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement