కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ఠాణాలో ఆకస్మిక తనిఖీ దుర్గమ్మ సేవలో .. మర్యాదపూర్వక కలయిక 26న ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌

న్యూస్‌రీల్‌

మెప్మా విభాగంలో ఆర్పీలపై పనిభారం ఐదు నెలలుగా జీతాలివ్వని పరిస్థితి గ్రూపుల వివరాలు.. రుణాలు.. తిరిగి చెల్లింపులు... అన్నీ ఆన్‌లైన్‌లో నమోదు తాజాగా జనాభా లెక్కల విధులు అప్పగించేలా చర్యలు పనులు చేయకపోతే తప్పుకోండంటూ అధికారుల హెచ్చరికలు!

జీతాలు లేక అప్పులపాలు

ఉన్నతాధికారుల ఆదేశాలతో విధులు అప్పగిస్తున్నాం

శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

తోట్లవల్లూరు: తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేత గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌ చంద్ర పునీతను ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వారిలో జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్‌, రాష్ట్ర కార్యదర్శి రజనీకాంత్‌ రెడ్డి, ఆర్టీసీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నర్సయ్య, రాష్ట్ర ప్రభుత్వ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కేశవ్‌ తదితరులు ఉన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వన్‌డే ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ ఫిడే రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌–2026ను ఈ నెల 26న కానూరులోని స్పాట్‌ స్పైన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నిర్వహిస్తామని ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఫణికుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్‌ కేటగిరీతో పాటు అండర్‌–7, 9, 11, 13, 15 బాల బాలికల విభాగంలో పోటీలు జరుగుతాయని చెప్పారు. టోర్నమెంట్‌లో పాల్గొనాలనుకునే వారు ఏపీ చెస్‌డాట్‌ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 97007 75220, 92471 53387 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

పట్టణాల్లోని మెప్మా విభాగంలో రిసోర్స్‌ పర్సన్‌ల మీద రోజురోజుకూ పని భారం పెరుగుతున్నా, ఐదు నెలలుగా జీతాలివ్వకపోవడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిపై.. మరోవైపు అధికారులు హెచ్చరికలు చేస్తుండం విమర్శలకు దారి తీస్తున్నాయి, పని భారం తగ్గించాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నా స్పందన లేదు.

పెడన: మెప్మా (మునిసిపల్‌ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్‌)లో పని చేసే రిసోర్స్‌ పర్సన్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఐదు నెలలుగా జీతాల్లేక సతమతమవుతుంటే.. మరోవైపు పని చేయలేకపోతే తప్పుకోండి అంటూ అధికారులు హెచ్చరికలతో కార్పొరేషనర్లు, మునిసిపాలిటీల్లో మెప్మా విభాగంలోని రిసోర్స్‌ పర్సన్స్‌ (ఆర్పీలు) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యాక్టివ్‌గా లేని స్వయం సహాయక గ్రూపులు (ఎస్‌హెచ్‌జీ– సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు) తొలగించడానికి చంద్రబాబు సర్కార్‌ చర్యలు తీసుకుంది. పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యాన స్వయం సహాయక గ్రూపులున్నాయి. 20 నుంచి 25 గ్రూపుల బాధ్యలను ఒక ఆర్పీ చూడాలి. ఒక గ్రూపు వివరాలు, సభ్యుల వివరాలు, సమావేశాలు, తీసుకున్న రుణాలు, ప్రతి నెలా కట్టేది, తదితర వివరాలను వివిధ యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాలి. ఒక గ్రూపు వివరాలను అప్‌లోడ్‌ చేయాలంటే సుమారు రోజున్నర లేదా రెండు రోజుల సమయం తీసుకుంటుందని ఆర్పీలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే యాప్‌ రూపొందించి ఒక గ్రూపు ఒకే చోట ఉండేలా, దానిలో సభ్యులు ఇతర గ్రూపుల్లో లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిధుల కొరత సాకుగా చూపి సర్కార్‌ ఇలాంటి ఎత్తగడ వేసిందనే విమర్శలు వస్తున్నాయి.

పని భారం అధికం

ప్రతి పురపాలక సంఘంలో ఆర్పీలు వారి పరిధిలోని గ్రూపులను, సభ్యులను ఆన్‌లైన్‌ చేస్తుంటారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.8వేలు, స్థానికంగా ఎస్‌ఎల్‌ఎఫ్‌ నుంచి రూ.2 వేలు మొత్తం రూ.10 వేలు వేతనంగా నిర్ణయించారు. మేనేజర్‌ యాప్‌ ద్వారా ప్రతి నెలా నిర్ణీత సమయంలో గ్రూపుల సమావేశాల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. ఈ యాప్‌లో సక్రమంగా పూర్తి చేస్తేనే జీతాలు వస్తాయి. సర్వర్లు పని చేయక అవి పూర్తవక చాలా మంది జీతాలు పెండింగ్‌లో పడిపోతున్నాయనే వాదనలున్నాయి.

పని భారం తగ్గించాలని కోరినా ఫలితం సున్నా

ఆర్పీలపై పని భారం అధికంగా ఉండటంతో ఇటీవల ఆర్పీలంతా కలిసి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేశారు. అయినా వారి ఆవేదను ఎవరూ పట్టించుకోలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఆర్పీలకు 2027–జనాభా లెక్కల విధులు అప్పగించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. వీరికి జనాభా లెక్కల విధులు అప్పగించడానికి జిల్లాలో రంగం సిద్ధమైంది. పని భారం అధికమైందని, చేయలేమని చెబుతుంటే తప్పుకో వేరే వారిని చూసుకుంటామనే సందేశాన్ని క్షేత్రస్థాయి సిబ్బందే అల్టిమేటం జారీ చేస్తుండటం విశేషం.

7

ఆర్పీలకు 2027–జనాభా లెక్కలు సర్వే విధులను అప్పగించొద్దని రాష్ట్ర అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే స్థానిక సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు వారికి కూడా సెన్సెస్‌ విధులు అప్పగించాలని నిర్ణయించారు. నాలుగు నెలలుగా వేతనాలు రాష్ట్ర వ్యాప్తంగా అందలేదు. ఐదో నెల నడుస్తోంది. ఆర్థిక సంవత్సరం కావడంతో జాప్యమైంది. త్వరలోనే జీతాలు విడుదలవుతాయి.

– డి.వి.జగదీష్‌, ఇన్‌చార్జి ఏవో, జిల్లా వెలుగు కార్యాలయం, మచిలీపట్నం

ఆర్పీలకు డిసెంబరు నుంచి జీతాలు రాని పరిస్థితి. దీంతో అప్పులు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో ‘మచిలీపట్నం’లో 3,627 గ్రూపులకు 122 మంది ఆర్పీలున్నారు. ‘పెడన’లో 669 గ్రూపులకు 27 మంది, గుడివాడలో 2,431 గ్రూపులకు 91 మంది, ఉయ్యూరులో 876 గ్రూపులను 31 మంది, వైఎస్సార్‌ తాడిగడపలో 1,915 గ్రూపులకు 50 మంది ఆర్పీలు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ‘జగ్గయ్య పేట’లో 1,146 గ్రూపులకు 42 మంది ఆర్పీలు, తిరువూరులో 890 గ్రూపులకు 34 మంది, నందిగామలో 1,157 గ్రూపులకు 44 మంది, కొండపల్లి పురపాలక సంఘ పరిధిలో 1,335 గ్రూపులకు 38 ఆర్పీలు విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement