కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 పొత్తుపొడిచిన విభేదాలు! అవనిగడ్డలో రచ్చ రచ్చ

న్యూస్‌రీల్‌

హెల్మెట్‌ వాడకంపై అవగాహన

మొక్కజొన్న పంట పరిశీలన

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో రగులుతున్న గొడవలు

మచిలీపట్నంలో జనసేన నాయకుడిఇంటి కూల్చివేతలో తమ్ముళ్ల హస్తం

అవనిగడ్డలో అన్న క్యాంటీన్‌ ప్రారంభ వేడుకలో జనసేన, తమ్ముళ్ల రగడ

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ మధ్య అంతరం

జగ్గయ్యపేటలో ఎడముఖం, పెడముఖంగా జనసేన, టీడీపీ నాయకులు

అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమిలో విభేదాలు తీవ్రమయ్యాయి. గతనెలలో కోడూరులో ఓ రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఉదయం ప్రారంభించగా, అదేరోజు సాయంత్రం టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు అదే రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. దీనిపై ఎథిక్స్‌ కమిటీకి ఎమ్మెల్యే, ఆయనపై జిల్లా మంత్రులు, టీడీపీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చెప్పడం వల్ల ఏ అధికారీ తమ మాట వినడం లేదని టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శలు చేశారు. గతంలో జరిగిన టీడీపీ సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకుల ముందు ఎమ్మెల్యే తీరుపై కొంతమంది నిరసన గళం వినిపించారు. తాజాగా అవనిగడ్డలో జరిగిన అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవ శిలాఫలకంపై టీడీపీ నేత, ఏఎంసీ చైర్మన్‌ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేదని ఆయన వర్గీయులు బైఠాయించి నిరసన తెలిపారు. శిలాఫలకాన్ని తొలగించి కాలువలో పడేసేందుకు యత్నించారు. చల్లపల్లిలో ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి ఏఎంసీ చైర్మన్‌ పేరు శిలాఫలకంపై వేశారని, ఆయన జనసేన వ్యక్తి కావడమే అందుకు కారణమని, ఇక్కడ టీడీపీ వ్యక్తి కావడంతో వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

పులిచింతల సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు.

7

వన్‌టౌన్‌: వెస్ట్‌ జోన్‌ ట్రాఫిక్‌ ఏసీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో హెల్మెట్‌ వాడకంపై బైకర్లకు అవగాహన కల్పించారు.

తోట్లవల్లూరు: వల్లూరుపాలెంలోని సొసైటీ భూముల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంటను బుధవారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ పరిశీలించారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు ఒకరిపై మరొకరు మండిపడుతున్నారు. ఇటీవల మచిలీపట్నంలో జనసేన నాయకుడి ఇంటి కూల్చివేత ఘటనతో టీడీపీ, జనసేన మధ్య అంతరం పెరిగింది. ప్రస్తుతం అక్కడ జరిగే కార్యక్రమాలకు జనసేన దూరంగా ఉంటోంది. ఇటీవల అవనిగడ్డలో అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవ శిలాఫలకంపై టీడీపీ నాయకుడి పేరు లేదని రచ్చ జరిగింది. విజయవాడ పశ్చిమంలో బీజేపీ కార్యక్రమాలకు టీడీపీ నేతలు దూరంగా ఉంటున్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ, జనసేన నాయకులు ఎడముఖం, పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. తిరువూరులో బీజేపీ, జనసేన నేతలకు నామినేటెడ్‌ పోస్టుల్లో తగు ప్రాధాన్యం ఇవ్వలేదు. పెనమలూరులో బీజేపీ నేతలను కలుపుకొని పోవడం లేదు. మట్టి, ఇసుక అక్రమ వ్యాపారాల్లో స్థానిక నేతల మధ్య వాటాల్లో తేడాలు రచ్చకెక్కుతున్నాయి. మొత్తం మీద కూటమి పార్టీ నాయకుల మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతోంది.

మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. బందరు కొబ్బరితోటలో జనసేన కార్యకర్త ఇంటిని అర్ధాంతరంగా కూల్చి వేయడంతో టీడీపీ, జనసేన మధ్య వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. జనసేన కార్యకర్త నిర్మిస్తున్న ఇంటిని టీడీపీ నేతలకు ముడుపులు చెల్లించలేదనే అక్కసుతోనే కూల్చివేశారు. టీడీపీ నేతలను వేడుకున్నా కూల్చివేత ఆపలేదని జనసేన నాయకులు ఆగ్రహించారు. దీంతో టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొ నేది లేదని బాయ్‌కాట్‌ చేశారు.

పెడన నియోజకవర్గంలో ఆది నుంచి జనసేనకు టీడీపీ నాయకులు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాలకు జనసేన నాయకులకు సరైన సమాచారం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో గూడూరు మండలంలో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కారుకు జనసేన నేత అడ్డంగా నిలబడి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ వైఖరికి మారకపోవడంతో జనసేనకు చెందిన మరో నాయకుడు నిరాహార దీక్షకు దిగాడు. మట్టి తోలకాల్లోనూ విభేదాలు ఉన్నాయి. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి పర్యటనలకు జనసేన నాయ కులు దూరంగా ఉండి, పార్లమెంటు ముఖ్యనేత కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

గన్నవరంలో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, జనసేన పార్లమెంటు ముఖ్యనేతకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. బాపులపాడు మండలంలో ఇంటి పన్ను పెంపు విషయంలో జనసేన నేతలు ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన జూద శిబిరాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడంపై టీడీపీ నాయకులపై జనసేన నేతలు విమర్శలు గుప్పించారు. బాపులపాడు పోలీసు స్టేషన్‌ ప్రారంభోత్సవంలో సైతం పార్లమెంటు ముఖ్యనేత పేరు లేకపోవడంతో జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి.

విజయవాడ సెంట్రల్‌లో తమకు టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రాధాన్యం ఇవ్వడంలేదని జనసేన, బీజేపీ నేతలు లోలోన రగిలిపోతున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్నవారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తమ అగ్రనేతలకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.

విజయవాడ పశ్చిమంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య పలు విషయాల్లో సఖ్యత కొరవడింది. పార్లమెంటు ముఖ్యనేత, టీడీపీ నేతలు చేసిన పనులను పలు సందర్భాల్లో బహిరంగంగానే బీజేపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి వ్యతిరేకించారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, టీడీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. జనసేన, టీడీపీ నాయకులకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి విలువ ఇవ్వడం లేదని ఇటీవల వాదోపవాదాలు జరిగాయి.

జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అధికార పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని తమకు ఇవ్వడం లేదని జనసేన, బీజేపీ నాయకులను ఆరోపిస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూటమి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరాయి.

Advertisement
 
Advertisement
Advertisement