20 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

20 కిలోల గంజాయి పట్టివేత

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

గన్నవరం: లారీ లో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయిని బుధవారం గన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. చైన్నె – కోల్‌కతా జాతీయ రహదారిపై అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ శ్రీధర్‌ నేతృత్వంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి చైన్నె వెళ్తున్న లారీలో ప్యాకింగ్‌ చేసిన 20 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌ అలుగు సంగయ్యను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసైన సంగయ్య గంజాయి తరలింపును ఆదాయ మార్గంగా ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement