ప్రజల్ని మోసగిస్తున్న చంద్రబాబు సర్కారు | - | Sakshi
Sakshi News home page

ప్రజల్ని మోసగిస్తున్న చంద్రబాబు సర్కారు

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

పెడన: వెన్నుపోటు, విధ్వంసం వంటివే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తోందని, గత 23 నెలలుగా ఇదే విధంగా ప్రభుత్వం నడుస్తోందని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. బుధవారం ఆమె కృష్ణాజిల్లా పెడనలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు అయ్యిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని, ఆర్ధిక విధ్వంసం, మహిళలకు రక్షణ లేకుండా చేయడం, పోలీసులను రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి వినియోగిస్తూ, పోలీస్‌ వ్వ వస్థను ప్రజల రక్షణకు, మహిళల రక్షణకు వినియో గించలేని దుస్థితిలో పరిపాలన ఉందని దుయ్యబట్టారు. 23 నెలల్లోనే చంద్రబాబు రూ.3.56 కోట్ల అప్పులు చేసి చరిత్ర సృష్టించారన్నారని విమర్శించారు. ఈ అప్పుల ద్వారా వచ్చిన నగదు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆమె ప్రశ్నించారు.

అవినీతి విపరీతంగా పెరిగిపోయింది..

కూటమి దారుణమైన పరిపాలన చేస్తోందని కల్యాణి ధ్వజమెత్తారు. అప్పులు చేసి సింగపూర్‌ వెళ్లి జల్సాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌లు స్పెషల్‌ ఫ్లయిట్‌ల కోసం రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని ఽపేర్కొన్నారు. నేడు మహిళలపై దాడులు పెరిగాయంటే అందుకు కారణం మద్యం, గంజాయి విక్రయాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీయే డ్రగ్స్‌తో దొరికితే ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక, పలురువు మహిళా నేతలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

Advertisement
 
Advertisement
Advertisement