ధాన్యం కొనుగోళ్లు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

పెనుగంచిప్రోలు: జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ అన్నారు. బుధవారం ఆమె మండలంలోని పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు గ్రామాల్లో ధాన్యం కల్లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకు వెళ్లాలన్నారు. ఒకవేళ లారీలు ఆలస్యమైతే రైతులు ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకు వెళ్లాలని సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. రైతులు చెప్పిన సమస్యలపై మిల్లర్లతో మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ పోసిబాబు, తహసీల్దార్‌ ఎ శాంతిలక్ష్మీ, ఏఓ కె రామసుబ్బారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement