గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలికలకు పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించా లని వర్క్‌షాప్‌లో వక్తలు పేర్కొన్నారు. మంగళవారం గవర్నర్‌పేటలోని ఇరిగేషన్ కాంపౌండ్‌లో రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, వసతి గృహాల బాలికల భద్రతా మార్గదర్శకాలు, సురక్షిత మౌలిక వసతులపై జిల్లా స్థాయి వర్క్‌షాప్ జరి గింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, హాస్టల్ వార్డెన్లు, కస్తూరిబా గాంధీజీ బాలికల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్
జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం మాట్లాడుతూ ప్రతి పాఠశాల నందు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098, కంప్లైంట్ బాక్స్ ఉండాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రణాళికలతో ఉపాధ్యాయులు పని చేస్తున్నారని వివరించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో సమగ్ర శిక్ష ద్వారా బాలికల భద్రత, మౌలిక సదుపాయాలను క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయుల సహకా రంతో పర్యవేక్షిస్తున్నారన్నారు. విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాసవి మాట్లా డుతూ.. అన్ని పాఠశాలల్లో బాలికలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. క్రాఫ్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ తంబీ, వై.జాన్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం. రాజేశ్వరరావు, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ భారతి, నోడల్ ఆఫీసర్ సీహెచ్ సాయి గీత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో వక్తలు


