విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవములు | - | Sakshi
Sakshi News home page

విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవములు

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవములు

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాదిపై వేంచేసి ఉన్న 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమంతునికి మండలాభిషేక మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అనంతరం విశేష అర్చనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్‌ గ్రూప్స్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement