ఫాం పాండ్‌పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఫాం పాండ్‌పనుల పరిశీలన

Apr 19 2026 8:23 AM | Updated on Apr 19 2026 8:23 AM

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌కు సేవల నాణ్యతలో విశేష ప్రగతిని సాధించినందుకు ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ గౌరవాన్ని దక్కించుకున్నామని బ్యాంకు చైర్మన్‌ నెట్టెం శ్రీరఘురామ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌వో) 9001–2015 సర్టిఫికెట్‌ను సంస్థ ప్రతినిధులు శనివారం చైర్మన్‌కు అందజేశారు. చైర్మన్‌ శ్రీరఘురామ్‌ మాట్లాడుతూ.. ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ కేవలం గుర్తింపు మాత్రమే కాదని, బ్యాంకులో అమలు చేస్తున్న వ్యవస్థలు, పారదర్శకత, సేవల ప్రమాణాలు, ఖాతాదారుల సంతృప్తికి ప్రపంచ స్థాయి ముద్ర అని వివరించారు. రైతులు, ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించాలనే మా నిబద్ధతకు ఇది ఒక ప్రతిఫలమని పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్‌ సాధించటం ద్వారా కేడీసీసీ బ్యాంకు రాష్ట్రంలోనే కాకుండా దేశస్థాయిలో సహకార బ్యాంకింగ్‌ రంగానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో సేవలను అందించడానికి కృతకృత్యులవుతామని చైర్మన్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో ఎ.శ్యామ్‌మనోహర్‌, ఐఎస్‌వో ప్రతినిధి ఆలపాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు.

పెడన: మండలంలోని మడక గ్రామంలో జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులతో చేపట్టిన కోనేటి గుంత (ఫాం పాండ్‌) తవ్వకం పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ శనివారం పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పది సూత్రాల కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర, నీటి భద్రత చాలా ముఖ్యమైనవన్నారు. కోనేటి గుంతల తవ్వడం, సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాలను పెంచుతున్నామని పేర్కొన్నారు. పంట కాలువలు, చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతామన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పెడనలో వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ శివప్రసాద్‌, జెడ్పీ సీఈఓ డాక్టర్‌ జె.అరుణ, జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్‌, ఇన్‌చార్జి తహసీల్దారు కె.అనిల్‌కుమార్‌, ఎంపీడీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

కేడీసీసీ బ్యాంక్‌కు

ఐఎస్‌వో సర్టిఫికెట్‌

Advertisement
 
Advertisement
Advertisement