వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ విభాగం జాయింట్ సెక్రటరీ రంగారావు
కంకిపాడు: జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పెనమలూరు మండలం గంగూరు చేపల కుండీల సెంటరులోని బ్లూమింగ్‌డేల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జిల్లా స్థాయి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.ఝాన్సీలక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ శాప్ లీగ్స్‌లో భాగంగా జిల్లా స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్, జిల్లా క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. అండర్ 15–అండర్19 బాల బాలికలు టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టోర్నమెంట్ ప్రారంభిస్తారని వివరించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): దొంగతనాలను ప్రవృత్తిగా చేసుకున్న ఆరేపల్లి దుర్గారావుపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను అమలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ వివిధ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 70కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న 38 సంవత్సరాల ఆరేపల్లి దుర్గారావుపై కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఈ యాక్ట్‌ను అమలు చేశారు. గత కొంతకాలంగా వివిధ దొంగతనాలు, ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతూ ప్రజలలో భయాందోళనలు కలిగిస్తున్న ఈ నిందితుడిపై సమగ్ర విచారణ నిర్వహించారు. పలు కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవించినప్పటికీ తన నేర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దుర్గారావు నేర నివేదికను కలెక్టర్ డీకే బాలాజీకు పంపగా నిజనిర్ధారణ కావడంతో అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్పీ తెలిపారు.
సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం
చల్లపల్లి: క్రికెట్ బెట్టింగులు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు చల్లపల్లి ఇన్‌చార్జి ఎస్‌ఐ పి.గౌతమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగులు ఆడేవారిపై, నిర్వహించే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. చల్లపల్లిలోని పలు ప్రాంతాలకు చెందిన ఎస్.హుస్సేన్, కె.రాజా, ఎం.శంకర్‌ప్రసాద్, ఎం.బ్రహ్మం, టి.సత్యనారాయణలతోపాటు మెరకనపల్లికి చెందిన సీహెచ్ వెంకట సురేష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి రూ.2500 నగదును, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌతమ్ కుమార్ తెలిపారు.


