ట్రాక్టర్‌ బోల్తా పడి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా పడి

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

ట్రాక్టర్‌ బోల్తా పడి

కూలీ మృతి

తాళ్లూరు(వత్సవాయి): ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో మహిళా కూలీ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ట్రాక్టర్‌పై వచ్చారు. మధ్యాహ్నం సమయంలో తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వేల్పుల అన్నపూర్ణమ్మ(65) అక్కడికక్కడే మరణించగా ట్రాక్టర్‌ డ్రైవర్‌ కాళ్ల మాధవరావు, బిట్రా రాధలకు గాయాలవడంతో వారిని మధిరలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement