ఎ.కొండూరు: మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన పిట్టా ఇస్సాకు (52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడేళ్లుగా కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్న ఇస్సాకు, డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఇప్పటివరకు సుమారు రూ.5లక్షల వరకు ఖర్చు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, సీఐటీయూ మండల కార్యదర్శి జట్టి వెంకటేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవనంపై నుంచి పడి కార్మికుడు దుర్మరణం
Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM
భవనంపై నుంచి పడి కార్మికుడు దుర్మరణం పెనమలూరు: తాడిగడపలో భవన నిర్మాణ కార్మికుడు భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు ఎస్‌ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం పొదిలి మండలం ఓబిలక్కపల్లి గ్రామానికి చెందిన కోనంకి జయపాల్(19) పదో తరగతి చదివి గత ఏడు నెలలుగా ఏలియా అనే తాపీ మేసీ్త్ర వద్ద పని చేస్తున్నాడు. కాగా తాడిగడప గ్రామంలో భవన నిర్మాణ పనులకు ఏలియాతో పాటు జయపాల్ రెండు రోజుల క్రితం వచ్చారు. అయితే బుధవారం పనులు ముగించుకొన్న జయపాల్ భవనంపై నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తూ భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి బలమైన గాయాలు తగలగా.. అతనిని కానూరులో ఆస్పత్రిలో చేర్చారు. జయపాల్ ఆస్పత్రిలో అదే రోజు మృతి చెందాడు. మృతుడి తండ్రి కోణంకి పెదమర్యాద ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి వడదెబ్బకు వృద్ధుడు మృతి గంపలగూడెం: వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన బుధవారం కొత్తపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. దళితవాడకు చెందిన కొర్రకొప్పు వెంకటేష్(60) బుధవారం గేదెలను కాసేందుకు వెళ్లాడని, సాయంత్రం 5గంటల సమయంలో గేదెలకన్న ముందుగానే ఇంటికొచ్చి మంచంపై కూర్చొని కొద్దిగా మజ్జిగ ఇమ్మని కుటుంబ సభ్యులను కోరినట్లు తెలిపారు. తిరిగి లేచి మజ్జిగ తాగి కుప్పకూలినట్లు చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముగ్గురికి వివాహం జరిగినట్లు తెలిపారు. భార్య గోపమ్మ ఆశ వర్కర్‌గా పనిచేస్తోంది.
Advertisement


