ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దుతాం

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

● సీనియర్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ● డీఎన్‌బీ సీట్ల కేటాయింపుపై హర్షం

గుంటూరు మెడికల్‌: ప్రముఖ జాయింట్‌ రీప్లేస్‌ మెంట్‌ సెంటర్‌, మల్టీ స్పెషాలిటీ విభాగాలు కలిగిన సాయి భాస్కర్‌ హాస్పిటల్‌కు ఆర్థో విభాగంలో రెండు డీఎన్‌బీ సీట్లు కేటాయిస్తూ ఎన్‌.బి.ఇ.ఎం.ఎస్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌(ఎన్‌.బి.ఇ.ఎం.ఎస్‌ ) సాయి భాస్కర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను జాతీయస్థాయిలో ఆర్థోపెడిక్‌ పీజీ ట్రైనింగ్‌ సెంటర్‌గా గుర్తిస్తూ డిప్లమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ (డీఎన్‌బీ) సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌లో గుజరాత్‌కు చెందిన డాక్టర్‌ జీల్‌ కటిరా, రాజస్థాన్‌కు చెందిన డాక్టర్‌ యశా జైన్‌లు సాయి భాస్కర్‌ హాస్పిటల్‌ను ఎంపిక చేసుకున్నారు. మంగళవారం అరండల్‌ పేటలోని హాస్పిటల్‌లో డాక్టర్‌ నరేంద్రరెడ్డి ఎదుట తమ తొలి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అందించారు. సీనియర్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఎన్‌బీ సీట్లను తమ హాస్పిటల్‌కు కేటాయించడం గర్వంగాను, ఆనందంగానే ఉందని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు డీఎన్‌బీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఎముకలు కీళ్ల విభాగంలో అన్ని విధాలా మెరుగైన విద్యను, ప్రాక్టికల్స్‌ను అందించి ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది తద్వారా జాతీయస్థాయిలో గుంటూరుకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని డాక్టర్‌ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ వైద్యుడు డాక్టర్‌ కొనకల్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement