తిరుపతమ్మకు బంగారు నక్లెస్‌ సమర్పణ | - | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మకు బంగారు నక్లెస్‌ సమర్పణ

Apr 4 2026 8:19 AM | Updated on Apr 4 2026 8:19 AM

తిరుపతమ్మకు బంగారు నక్లెస్‌ సమర్పణ నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం తిరుపతమ్మవారిని తాకిన సూర్యకిరణాలు

పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారికి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన బూరుగుపల్లి శివరామకృష్ణ, వాణి దంపతుల మేనకోడలు భోగవల్లి దివ్యతేజ 25 గ్రాముల, 950 మిల్లీ గ్రాముల నక్లెస్‌ను ఆలయ సూపరింటెండెంట్‌ రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ మాజీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు, నాయకులు రేగండ్ల రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. యనమలకుదురుకు చెందిన గొట్టిపాటి పూర్ణచంద్రరావు, ప్రమీలరాణి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు దుర్గగుడికి విచ్చేశారు. వారి 60వ పెళ్లిరోజు పురస్కరించుకుని అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేయగా, కమిటీ చైర్మన్‌ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారిని శుక్రవారం సూర్య కిరణాలు తాకాయి. గర్భాలయంలో ఉదయం అర్చకులు అభిషేకాలు చేస్తున్న సమయంలో మూలవిరాట్‌ను ఉదయం 6.30 నుంచి 6.45 గంటల మధ్యలో సూర్య కిరణాలు తాకాయి. అమ్మవారి పాదాల నుంచి ముఖం వరకు అమ్మవారిని సూర్య కిరణాలు వెలిగించిన దివ్య తేజస్సును చూసి భక్తులు పరవశులయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం చుట్టూ సిమెంట్‌ రోడ్డుపై నీటితో తడుపుతూ కాళ్లు కాలకుండా మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement