ప్రస్తుతం పూర్తి సీజన్ కాకపోయినా నాగాయలంక మండలం మడ అడవుల తీరంలో యానాదులు పీతల వేటలో సౌకర్యాలు లేమితో ఇబ్బంది పడటం నిజమే. సొర్లగొంది నుంచి లైట్‌హౌస్ వరకు మడ అడవులు తీరంలో వంద కుటుంబాలు పీతల వేటలో ఉన్నారు. అయితే వీరిలో 80శాతం మందిని కొందరు వ్యాపారులు బందరు, బంటుమిల్లి, బాపట్ల, నెల్లూరు నుంచి తెస్తున్నారు. స్థానికులకు ఉపాధి కొరవడుతోంది. జిల్లా యంత్రాంగం యానాదులకు రక్షణ, ఉపాధి పెంపొందించాలి.
– నక్కా విజయబాబు, ప్రధాన కార్యదర్శి,
రాష్ట్ర యానాది మహానాడు


