కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Mar 26 2026 11:42 AM | Updated on Mar 26 2026 11:42 AM

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026 వేసవికి ముందే సిద్ధంగా లేకుంటే మున్ముందు ముప్పే! వేణుగోపాలుని హుండీ ఆదాయం జల్‌ జీవన్‌ మిషన్‌పై చిత్తశుద్ధి లేదు.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి స్వాధీనం దుర్గమ్మకు రూ. 2.75లక్షల విరాళాలు సముద్ర బాట పట్టిన తాబేళ్ల పిల్లలు సమగ్ర భూ సర్వే పరిశీలన సుబ్బారాయుడి హుండీ ఆదాయం రూ. 89.17లక్షలు ● మైలవరం మండల పరిధిలో దేవుని చెరువు, తోలుకోడు, వెల్వడం, చంద్రాల, కీర్తిరాయినిగూడెం గ్రామాలలో పైపులైన్‌ల మరమ్మతులు, మోటార్ల రిపేర్ల వల్ల అప్పుడప్పుడు తాగునీటి సమస్య తలెత్తుతోంది. ● రెడ్డిగూడెం మండల పరిధిలోని రెడ్డిగూడెం, కొత్తనాగులూరు గ్రామాల్లో మోటార్లు పని చేయక అప్పుడప్పుడు నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ● ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కొండపల్లి బొమ్మల కాలనీలోపైపులైన్‌ ఉన్నప్పటికీ ఎనిమిది నెలలుగా తాగునీటి సరఫరానే లేక స్థానికులు నరకయాతన పడుతున్నారు. ● కంచికచర్ల మండల పరిధి మోగులూరు, వేములపల్లి, గొట్టిముక్కల, కంచికచర్ల, పరిటాల, వీరులపాడు, చందర్లపాడు, నందిగామ మండలాల్లోని పలు గ్రామాల్లో, వత్సవాయి మండల పరిధిలో భీమవరం, మక్కపేట, మంగొల్లు, వత్సవాయి, ఖమ్మంపాడు, మాచినేనిపాలెం గ్రామాలలో మోటార్ల రిపేర్లు, పైపులైన్‌ల మరమ్మతుల వల్ల తాగునీటి సమస్య తలెత్తుతోంది. ● జగ్గయ్యపేట మండల పరిధిలో జయంతిపురం, రావిరాల, చిల్లకల్లు, అన్నవరం గ్రామాలు, పెనుగంచిప్రోలు మండల పరిధిలో పలు గ్రామాలలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ● ఏ.కొండూరు మండల పరిధిలో 32 గ్రామాలకు కృష్ణావాటర్‌ పైపులైను ఏర్పాటు పూర్తికాక, కొన్ని గ్రామాలలో పాత పైపులైన్‌లకే కృష్ణావాటర్‌ కనెక్షన్‌ ఇవ్వడంతో సరఫరా సమస్య తలెత్తి తాగేందుకు నీరు లేక నరకయాతన పడుతున్నారు. ● తిరువూరు మండల పరిధిలో వావిలాల, ఎర్రమాడు, గంపలగూడెం మండల పరిధిలో కొణిజర్ల, ఊటుకూరు గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. ● విజయవాడ నగరంలో సైతం వేసవిలో కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొనక తప్పడం లేదు. తాగునీరు రావడం లేదు..

న్యూస్‌రీల్‌

గ్రామీణ ప్రాంతాలలో

ఇప్పటికే ప్రారంభమైన ఇక్కట్లు

పైపులైన్‌లు, మోటార్లు, చేతిపంపులు మరమ్మతులతో నిత్యం సమస్య

నిర్లక్ష్యం వీడకపోతే మండుటెండల్లో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం

జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026
వేసవికి ముందే
సిద్ధంగా లేకుంటే మున్ముందు ముప్పే!

సాగర్‌ నీటిమట్టం వివరాలు

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం.

గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి హుండీల్లోని కానుకలను లెక్కించగా రూ. 15.17 లక్షల నగదు, 129గ్రాముల వెండి, 10 ఆస్ట్రేలియా డాలర్లు వచ్చినట్లు ఆలయ ఏసీ సంధ్య తెలిపారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు సమర్థంగా పనులు చేపట్టి ఐదేళ్ల కాలంలో ఎన్టీఆర్‌ జిల్లాలో 1,10,727 ఇంటింటి కుళాయి కనెక్షన్‌లను ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఈ పథకం మరుగున పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎనిమిది మంది అంతర్‌ రాష్ట్ర

గంజాయి ముఠా అరెస్టు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను ఈగల్‌ బృందం అరెస్టు చేసి, వారి నుంచి 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్‌ బృందం, ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, డాగ్‌ స్క్వాడ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో గంజాయి తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో ఈగల్‌ బృందం, ఇతర భద్రతా దళాలతో కలసి జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వాటిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 8 మంది అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు.

ఒడిశా నుంచి..

గంజాయి ముఠా సభ్యులు ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని కేరళ, తిరుపతి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. విజయవాడ మీదుగా గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాల రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఈగల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రవీంద్ర హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌లు జె.వి.రమణ, డి.నాగార్జున, ఎస్‌లు ఎం. వీరాంజనేయులు, రాంబాబు, డాగ్‌ స్వ్కాడ్‌ ఆర్‌ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి, ఉచిత ప్రసాద వితరణకు ముదునూరుకు చెందిన భక్తులు బుధవారం రూ. 2.75లక్షల విరాళాన్ని అందజేశారు. యలమంచిలి రంగారావు అమ్మవారి అన్నదానానికి రూ. 1.40లక్షలు, యలమంచిలి సీతా మహాలక్ష్మి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1.35లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో ఆలయ అధికారులు, అర్చకులు సత్కరించారు.

కోడూరు: సముద్ర కాలుష్యాన్ని నివారించే అరుదైన ఆలీవ్‌ రిడ్లే తాబేళ్ల పిల్లలను అటవీ అధికారులు బుధవారం సముద్ర బాట పట్టించారు. హంసలదీవి సాగరతీరం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆలీవ్‌ రిడ్లే తాబేళ్లు తీరంలోని ఇసుకతిన్నెల వెంట గుడ్లు పెట్టగా, వాటిని అటవీ సిబ్బంది సేకరించి నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర సంతానోత్పత్తి కోసం ప్రత్యేక కేంద్రంలో వాటిని భద్రపర్చారు. ప్రస్తుతం తొలివిడతగా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 123 తాబేళ్ల పిల్లలను సముద్ర బాట పట్టించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని, తాబేళ్ల పిల్లలను సముద్రం వైపునకు విడిచిపెట్టారు. వైల్డ్‌ లైఫ్‌ ఏలూరు డివిజన్‌ డీఎఫ్‌ఓ త్రిమూర్తుల రెడ్డి, అటవీ రేంజర్‌ ఎస్‌వీకే కుమార్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి టి.నాగమణి, ఎఫ్‌బీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎ.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం అమలుపై ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ బుధవారం ఎ.కొండూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎ.కొండూరులోని పాత సినిమాహాలు వద్ద జరుగుతున్న సర్వే పనులను తహసీల్దార్‌ ఎన్‌.అరవింద్‌తో కలసి పరిశీలించారు. భూ సర్వే పక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వేలో ఉపయోగిస్తున్న పరికరాలను జేసీ పరిశీలించారు. సర్వే ద్వారా స్పష్టమైన రికార్డులు సిద్ధమవుతాయని, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల్లో రూ. 89,17,515 నగదు రూపంలో వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో మచిలీపట్నం డివిజన్‌ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు, బోగిరెడ్డిపల్లి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎన్‌. అరుణ సమక్షంలో కానుకలు లెక్కించారు. డీసీ శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ మొత్తం 76 రోజులకు గాను రూ. 89,17,515నగదు, బంగారం 44.004 గ్రాములు, వెండి 1.686 కిలోలు, అమెరికా డాలర్లు 129, ఇంగ్లాండ్‌ కరెన్సీ 5, ఆస్ట్రేలియా కరెన్సీ 20 సమకూరినట్లు వివరించారు. లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

జి.కొండూరు: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో క్రమక్రమంగా తాగునీటి సమస్య తలెత్తుతోంది. మోటార్లు, పైపులైన్‌ల మరమ్మతుల సమస్యతో తాగునీటి సరఫరాకి బ్రేక్‌పడి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆపదలో ఆదుకోవాల్సిన చేతి పంపులు మరమ్మతులకు నోచుకోక మూలన పడుతున్నాయి. వేసవి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత లేకనే సమస్య ఉత్పన్నమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే కరువు సంభ విస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎనిమిది నెలలుగా తాగునీరు లేక..

జి.కొండూరు మండల పరిధిలో దుగ్గిరాలపాడు గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణా నీరు సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు నరకయాతన పడుతున్నా రు. గ్రామంలో 1200మంది వరకు జనాభా ఉండగా గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉండటంతో వీరంతా కృష్ణావాటర్‌పైనే ఆధారపడ్డారు. దీంతో వీరు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న గంగినేని వెళ్లి ప్యూరిఫైడ్‌ వాటర్‌ని తెచ్చుకుంటున్నారు. వీలుకాని వాళ్లు ఫ్లోరైడ్‌ నీటినే తాగుతున్నారు. అదేవిధంగా గంగినేని, తెల్లదేవరపాడు, సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, చెర్వుమాధవరం గ్రామాలకు పైపులైన్‌ సమస్యతో నెలకు ఒకసారి చొప్పున కృష్ణా నీటిని విడుదల చేస్తున్నారు. భీమవరప్పాడు, చిన్ననందిగామ గ్రామాలకు కృష్ణావాటర్‌ పైపులైను లేక తాగునీరు అందుబాటులో లేక వాటర్‌ ప్లాంట్‌లకు పరుగులు పెడుతున్నారు.

జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు..

మా గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణావాటర్‌ రావడం లేదు. తాగేందుకు నీరులేక గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. పైపులైన్‌లు లీకుల వల్ల నీళ్లు రావడంలేదని చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా లీకులకు మరమ్మతులు చేయకపోవడం దుర్మార్గం. గ్రామస్తులంతా వాటర్‌ ప్లాంట్‌లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

– జడ రాంబాబు, సర్పంచ్‌,

దుగ్గిరాలపాడు

విజయవాడ నగరపాలక సంస్థలో ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లకు నగరంలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌, డెప్యూటీ మేయర్‌ దంపతులతో పాటు కార్పొరేటర్లను సత్కరించారు. పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. మేయర్‌ భాగ్యలక్ష్మి దంపతులను సత్కరిస్తున్న దృశ్యాన్ని చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

7

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

ఎన్టీఆర్‌ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌ కింద

తాగునీటి సరఫరా వివరాలు

తాగునీటి సరఫరా హ్యాబిటేషన్‌లు 794

గ్రామాలు 321

జనాభా 9,87,854

కుటుంబాలు 2,67,574

ఇంటింటి కుళాయి కనెక్షన్‌లు 1,10,727

సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు 19 ట్యాంకులు

రక్షిత మంచినీటి పథకాలు 375 ట్యాంకులు

మీడియం రక్షిత మంచినీటి పథకాలు 63 ట్యాంకులు

డైరెక్ట్‌ పంపింగ్‌ స్కీములు 508

చేతి పంపులు 7,846

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement