లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో బుధవారం నిర్వహించిన ఉమెన్ హుడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘రైజ్’ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి ముందస్తు అనుభవం లేకపోయినా, కేవలం ఆలోచనతో వస్తే చాలని, వారికి అవసరమైన శిక్షణ, మార్కెటింగ్ మెలకువలు, సాంకేతిక సహకారాన్ని ఈ సెంటర్ల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నర్‌వీల్ ఇంటర్నేషనల్ మాజీ కోశాధికారి సరిత లునాని, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్ పర్సన్ అమ్రిత కుమార్, కలెక్టర్ సతీమణి సుప్రిత, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ సీనియర్ చైర్ పర్సన్ సుప్రియ మలినేని తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


