లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో తొలిసారిగా ఏప్రిల్ నాలుగో తేదీన ఆర్టిఫిషియల్ ఇటెలిజెన్స్ (ఏఐ) సమ్మిట్ జరుగుతుందని ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్టీపీఐ సహకారంతో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో ఆయన బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో వస్తున్న మార్పులు, పరిశ్రమల్లో ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం, ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మిట్ కోచైర్మన్ సురేష్ నర్రా, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఇంద్రజిత్ అన్నే మాట్లా డుతూ.. ఏఐ ట్రెండ్స్‌ను అందరికీ తెలపాలనే ఉద్దేశంతో సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు.


