కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలు పల్లెల్లో వైద్యం అందని దయనీయ పరిస్థితి ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్‌లకు బ్రేక్ జీజీహెచ్‌లో సేవలు అంతంత మాత్రమే.. గత ప్రభుత్వంలో గ్రామీణులు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం
దీర్ఘకాలిక రోగుల ఇబ్బందులు
వైద్యరంగాన్ని విస్మరించడం సరికాదు
గతంలో పలుమార్లు విఫలయత్నం
‘సాక్షి’ కథనాలతో నిషేధిత జాబితాలో చేర్చిన కలెక్టర్
అయినా ఆగని పెద్దల యత్నాలు
రెండు రోజుల క్రితం తిరిగి నిర్మాణాలు చేపట్టే యత్నం
కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ కలెక్టర్‌కు లేఖ రాసిన ప్రిన్సిపాల్
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
గత ప్రభుత్వంలో ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష పేరుతో నిత్యం వైద్యులు, స్పెషలిస్టు డాక్టర్లు గ్రామాల్లోనే ఉండేవారు. రోగులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చేవాళ్లు. అంతేకాదు మంచంలో ఉన్న వారిని గుర్తించి వారి వద్దకే వెళ్లి పరీక్షలు చేసేవారు. ఇప్పుడు అవన్నీ నిలిచి పోయాయి. వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
– నిమ్మకూరి అవినాష్, ఉయ్యూరు
అవనిగడ్డ: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ పూర్తిచేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులని వివరించారు. ఆ రోజు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఉపాధి అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు బయోడేటా, ఆధార్, లింకై న ఫోన్ నంబర్, పాన్ సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 63006 18985, 79955 34572 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
గుడివాడ టౌన్: క్రీడలు ఆరోగ్యాన్ని, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని ఏఎన్నార్ కళాశాల ప్రిన్సిపాల్ పీజేఎస్ కుమార్ అన్నారు. కళాశాలలో శనివారం కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ పరుగు పోటీలు నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలోని పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఉయ్యూరు సిద్ధార్థ కళాశాల ప్రథమస్థానం, ఏఎన్నార్ కళాశాల ద్వితీయ, విజయవాడ బ్రహ్మయ్య కళాశాల విద్యార్థులు తృతీయ స్థానం సాధించారన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ కేఎస్ అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ బీఎస్‌ఎస్ పద్మజ, పీడీ వి.గోపి, కృష్ణా యూనివర్సిటీ ప్రతినిధులు బి.ఉదయ్‌కుమార్, ఎన్.హేమ వెంకట లక్ష్మి, పి.చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. మాఘ శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో కల్యాణ వేదికపై స్వామి వారి కల్యాణోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం రాజగోపురం ఎదుట కళావేదికపై కల్యాణోత్సవం జరిగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను కళావేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. కల్యాణోత్సవంలో దేవస్థానం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): డ్రగ్స్‌పై సమాజంలో మరింత చైతన్యం రావాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. గంజాయి తీసుకున్నా, అమ్మినా నేరమేనని, వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈగల్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో వాక్‌థాన్ జరిగింది. ఎంజీ రోడ్డులో ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొ రేషన్ స్టేడియం వద్ద వాక్‌థాన్‌ను సీపీ రాజశేఖరబాబు, ఈగల్ ఐజీ ఆర్.కె.రవికృష్ణ, డాక్టర్ పోతినేని రమేష్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డ్రగ్స్‌ను నిరోధించేందుకు ఈగల్ టీమ్‌ను ప్రవేశపెట్టామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో 22 మందిపై పీఐటీ ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం, విద్యావేత్త ఎంసీదాస్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ ఎం.ఎస్.రామ్మోహనరావు, సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఏపీ హెవీ మెషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఆప్మెల్) సంస్థలో ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఉత్తీర్ణులైన వారు అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ చైర్మన్ ఎన్‌వీకే శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండపల్లి ఏపీహెచ్‌ఎంఈఎల్ కంపెనీ, విజయవాడ ఐటీఐ కళాశాలలో ఈనెల 31వ తేదీ సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. దరఖాస్తుతో పాటు టెన్త్‌క్లాస్, ఐటీఐ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రం మొదలైన సర్టిఫికెట్లు పొందుపర్చాలని తెలిపారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భూముల మార్కెట్ విలువ పెంపుపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన మార్కెట్ విలువలను ఆదివారం నుంచి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డులు, శాఖ అధికారిక వెబ్ సైట్‌లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచుతా రన్నారు. అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈ నెల 29వ తేదీ లోపు రాతపూర్వకంగా సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు. ఈ నెల 30న జరిగే కమిటీ సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 31న మార్కెట్ మార్గదర్శక విలువలకు తుది ఆమోదం తెలియజేస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి కమిటీ ఆమోదం పొందిన మార్కెట్ విలువలు అమల్లోకి వస్తాయన్నారు. భూ యజమానులు, సాధారణ ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని జేసీ కోరారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో గ్రామీణ వైద్యం పూర్తిగా పడకేసింది. దీనికి నిదర్శనం జీజీహెచ్‌లో ఓపీలు తగ్గడమే. పీహెచ్‌సీల్లో ప్రసవాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి వైద్య సేవలు అందించే ఫ్యామిలీ ఫిజీషి యన్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు మంగళం పలికారు. 108 వాహనాలు నేడు కుయ్యో మొర్రో అంటున్నాయి. ఇక 104 వాహనాల జాడే లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ నిర్వీర్యంగా మారాయి. దీంతో పేదలు అవస్థ పడుతున్నారు. ఏడాదిన్నరలో దిగజారిన ప్రభుత్వ వైద్య సేవలపై కథనం.
జీజీహెచ్ సేవలపై అపనమ్మకం
గత ప్రభుత్వంలో జీజీహెచ్‌కు వెళితే నాణ్యమైన వైద్య సేవలు అందుతాయనే నమ్మకం కలిగించారు. ప్రస్తుతం పాలకులు ఆ నమ్మకం సడలి పోయేలా చేశారు. అవసరమైన మందులు ఉండక, రక్తపరీక్షలు సైతం ‘ప్రైవేట్’లో చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుండె ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక ఆపరేషన్ థియేటర్ నిర్వీర్యంగా మారింది. సీటీస్కాన్ యంత్రాలు మొండికేస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అంతంత మాత్రంగా సేవలు అందుతున్నాయి. గతంలో నిత్యం 3200 నుంచి 3500 వరకూ వచ్చే ఓపీ రోగులు నేడు 2600కు తగ్గారు. అత్యవసర వైద్యానికి వచ్చే వారిని మళ్లీ గుంటూరు పంపే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
గ్రామీణులకు భరోసా ఏదీ
దేశంలోనే తొలిసారిగా గత ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా స్పెషలిస్టు వైద్యులను గ్రామాలకు పంపించి పరీక్షలు చేసి ప్రజలకు భరోసా కల్పించారు. అవసరమైతే మెరుగైన వైద్యానికి జీజీహెచ్‌కు తరలించేవారు. వైద్య సేవలు పొంది ఇంటికి వెళ్లేవరకు ఆరోగ్య సిబ్బంది ఆరా తీస్తుండేవారు. నేడు ఆ సేవలు నిలిచిపోవడంతో గ్రామీణులకు అనారోగ్యం చేస్తే మళ్లీ పట్టణాలకు పరుగులు పెట్టాల్సిన దయనీయ స్థితి నెలకొంది.
నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్
ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమానికి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది. మారుమూల గ్రామాలకు సైతం 104 వాహనంలో కుటుంబ డాక్టర్ (ఫ్యామిలీ ఫిజీషియన్) ద్వారా పదిహేను రోజులకు ఒకసారి వెళ్లి వైద్య సేవలు అందించే వారు. ఇప్పుడు అవి పడకేశాయి. గతంలో ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్ చేసి, ఎంపిక చేసిన తేదీల్లో వైద్యులు, సిబ్బంది వెళ్లి సేవలు అందించేవారు. మంచాన ఉన్న రోగుల ఇళ్లకే వెళ్లి వైద్యులు చూసేవారు. ఇప్పుడు అవేమి లేవు. కనీస మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు.
కుయ్యో.. మొర్రో అంటున్న 108
ఎన్టీఆర్ జిల్లాలో 24, కృష్ణా జిల్లాలో 29 వాహనాలు ఉన్నాయి. కొంతకాలంగా 108 వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. ఇతర ప్రాంతాల నుంచి రావాలంటే 45 నిమిషాల నుంచి గంటకు పైగా పడుతోంది. దీంతో రోగులు ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ప్లాస్టిక్‌తో ఆరోగ్యానికి చేటు
కంచికచర్ల(వీరులపాడు): ప్లాస్టిక్‌తో ఆరోగ్యానికి చేటు కలుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రజలు, అధికారులు సమన్వయంతో పని చేసి స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలపాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర, జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర థీమ్‌లో భాగంగా కంచికచర్ల పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మహమ్మారి లాంటిదని, పర్యావరణాన్ని సైతం దెబ్బతీస్తుందన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రపై అవగాహన ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి, డివిజనల్ లెవల్ అభివృద్ధి అధికారులు లక్ష్మీకుమారి, శ్రీనివాసరావు, డీపీఎల్‌వో రాఘవన్, సర్పంచ్ వేల్పుల సునీత తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా మూడో రోజు శనివారం రాత్రి నూతనంగా తయారు చేసిన టేకు రథంపై ఉభయ దేవేరులు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రథంపై ఊరేగించారు. తొలుత ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీ రామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడుబుద్దు పవన్‌కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి విశ్వనాథసుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ప్రత్యేక పల్లకీపై ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం సిద్ధం చేసిన కొత్త రథంపై స్వామివార్లు ఆశీసులయ్యారు. రథాన్ని విద్యుత్ దీపాలు, ప్రత్యేక పూలతో అందంగా అలంకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు, నియోజకవర్గ నేత మండలి వెంకట్రామ్, తహసీల్దార్ హరనాథ్, నారాయణరావు, సర్పంచ్ నందిగం మేరీరాణి, మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరావు టెంకాయలు కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. అవనిగడ్డ డీఎస్పీ ఆధ్వర్యంలో చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ గౌతమ్ కుమార్ భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బాణసంచా సందడి, యువత కేరింతల మధ్య ఊరేగించారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు నేతృత్వంలో చల్లపల్లి ఎస్టేట్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
టేకు రథం బహూకరణ
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి సినీనిర్మాత అట్లూరి నారాయణరావు ఆర్థిక సహకారంతో రూ.కోటి పైగా వెచ్చించి తయారు చేయించిన టేకురథాన్ని సినీ హీరో నారా రోహిత్ చేతుల మీదగా శనివారం డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావుకు అందజేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు.
బాలికా సాధికారతే లక్ష్యం
మచిలీపట్నంఅర్బన్: బాలికా సాధికారత దిశగా అడుగులు వేయడమే ధ్యేయమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ పేర్కొన్నారు. జాతీయ బాలికా సాధికారత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారి హక్కులను కాపాడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు తల్లి దండ్రులకు అవగాహన కల్పించి బాలికల విద్యాభివృద్ధికి సహకరించాలని సూచించారు. మైనర్ బాలికలకు వివాహాలు చేయడం నేరమని, దానిపై గ్రామీణ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ ప్రేమ్‌చంద్, ఏఓ సురేష్, ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ప్రాంగణం, పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. డాక్టర్ హిమబిందు, డాక్టర్ నిరీక్షణ తదితర వైద్య అధికారులు, సిబ్బంది ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఎస్‌ఆర్‌ఆర్ స్థలంపై కబ్జాదారుల కన్ను
మధురానగర్(విజయవాడసెంట్రల్): నగరం నడి బొడ్డున కోట్లాది రూపాయల విలువచేసే ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు అధికార పార్టీ నేతల అండదండలతో సిద్ధం అయ్యారు. బీఆర్టీఎస్ రోడ్డు సమీపంలోని గులాబీతోటలో కళా శాలకు చెందిన 6.67 ఎకరాల స్థలం ఉంది. దీన్ని కబ్జా చేసేందుకు ఎన్నో ఏళ్లుగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దీనిపై కోర్టులో సైతం పలుమార్లు వివాదాలు నడిచాయి. ఇటీవల అధికార పార్టీ నేతల అండదండలతో ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆ స్థలంలో నిర్మాణాలు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పోరాటం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ అండదండలతో స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ విషయాలపై పలుమార్లు ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. మీడియా కథనాలతో కలెక్టర్.. కళాశాలకు చెందిన 6.67 ఎకరాల స్థలాన్ని నిషేధిత జాబితాలో చేరుస్తూ జీఓ జారీ చేశారు. అప్పటి నుంచి కొంత స్తబ్దుగా ఉన్న కబ్జారాయుళ్లు తిరిగి గత రెండురోజులుగా కళాశాలకు చెందిన స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధపడ్డారు. కళాశాలకు చెందిన స్థలాన్ని శుభ్రం చేయటంతో పాటు నిర్మాణాలు చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. సమాచారం అందుకున్న పూర్వ విద్యార్థులు సదరు విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె కళాశాల స్థలానికి హద్దులు నిర్మించి ఫెన్సింగ్ వేసి పరిరక్షించాలంటూ కలెక్టర్‌కు లేఖ రాశారు. అయినప్పటికీ కబ్జారాయుళ్లు మాత్రం ఎవరూ ఏమీ చేయలేరని, ఈ స్థలం తమదేనని తాము కచ్చితంగా నిర్మాణాలు చేసి తీరుతామని చెబుతుండటం గమనార్హం. కబ్జాదారులకు అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలు ఉండటంతో నిషేధిత జాబితాలో ఉన్న కళాశాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పూర్వ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): మహా శివరాత్రి సందర్భంగా భారతీయ రైల్వే–భారత్ గౌరవ్ టూరిస్ట్ సౌత్‌స్టార్ రైల్ ఆపరేటర్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో నవ జ్యోతిర్లింగ ప్రత్యేక పర్యాటక రైలును నడపనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విఘ్నేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశ పురాతన సంప్రదాయాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రత్యేక అవకాశంగా ఉంటుందని తెలిపారు. ఈ యాత్రలో ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, గుజరాత్‌లోని సోమనాథ్, మహారాష్ట్రలోని త్రయంబ కేశ్వర్, భీమశంకర్ తదితర జ్యోతిర్లింగాల దర్శనం, ఏపీలోని మల్లికార్జునస్వామి ఆలయాలు సందర్శిస్తారు. ఈ యాత్రలో టూర్ గైడ్, సీసీ టీవీ కెమెరాలతో భద్రత, కోచ్‌ల్లో సెక్యూరిటీ, టూర్ మేనేజర్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్సు, వసతి, సందర్శన ప్రదేశాలకు రవాణ సదుపాయం, ఉదయం ఆల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి బోజనం సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఈ యాత్రకు ఒక్కొక్కరి స్లీపర్ క్లాస్ రూ. 29,750, 3ఏసీ (జనత) రూ. 35,000, 3ఏసీ (కంఫర్ట్) రూ. 44,950, 2ఏసీ (డీలక్స్) రూ. 49,550 ధరగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు 93550 21516 నంబర్‌లోగానీ, టూర్‌టైమ్స్ వెబ్‌సైట్ నుంచి టికెట్ పొందవచ్చని సూచించారు.
7
ప్రభుత్వం వైద్య రంగాన్ని విస్మరించడం సరికాదు. గత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం ప్రభుత్వాస్పత్రిల్లో అందుతుందనే భరోసా కల్పించారు. దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. వైద్య రంగాన్ని విస్మరించడం సరికాదు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు ఇవ్వడం కూడా తప్పే.
– మునీర్ అహ్మద్ షేక్, విజయవాడ
ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా కొనసాగక దీర్ఘకాలిక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రక్తపోటు, మధుమేహం, హైపో థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగులను గుర్తించి, వారిని 104 సేవలకు మ్యాపింగ్ చేసేవారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లినప్పుడు వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొందరు పీహెచ్‌సీల దారి పడుతుండగా, మరికొందరు విజయవాడలోని పెద్దాస్పత్రికి వస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


