ఉప్పులూరు బాధితులకు న్యాయం చేయాలి
తోట్లవల్లూరు: ఉప్పులూరు ఘటన అమానుష మని, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేలుతోందనటానికి ఇది నిదర్శమని పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్ అన్నారు. ఉప్పులూరు కోడిపందేల బరిలో కూలి పనికి తోట్లవల్లూరు నుంచి 11 మందిని తీసుకువెళ్లి వారికి డబ్బులు ఇవ్వకపోగా వారిపై దొంగతనం ముద్ర వేశారన్నారు. వారి చొక్కాలు విప్పి, తాళ్లతో కట్టేసి అత్యంత అమానవీయంగా హింసించారన్నారు. బాధిత కుటుంబా లను అనిల్‌కుమార్ శనివారం సాయంత్రం పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో బాధితులైన గొల్లపల్లి మధు, వల్లూరు సురేష్, వెంకటరత్నం, చింతా పాండు తదితరులు తమపై జరిగిన హింసాత్మక చర్యలను అనిల్‌కుమార్ ముందు ఏకరువు పెట్టారు. తమను తప్పు చేశామని ఒప్పుకోవా లంటూ రైలు పట్టాలపై పడుకోబెట్టడం, లారీ టైరు కింద పడేసి చంపేస్తామంటూ బెదిరించారన్నారు. కారులో ఎక్కించుకుని తెలియని ప్రదేశా లలో తిప్పుతూ నరకయాతన చూపించారన్నారు. ఇంత అరాచకంగా వ్యవహరించిన వారిపై హత్యా యత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కై లే అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వం చర్యలు తీసుకోనట్లయితే వైఎస్సార్ సీపీ నిజనిర్దారణ బృందాన్ని రప్పించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ ఈడ్పుగంటి రాజామణి, పార్టీ మండల అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ కళ్లం శివారెడ్డి, నాయకులు నడకుదురు రాజేంద్ర, చింతలపూడి గవాస్కర్‌రాజు, చింతా రాజా, ఈడ్పుగంటి రూబెన్, మోర్ల పూర్ణప్రసాద్, మైనేని తారాచంద్, చింతలపూడి సుబ్బారావు, ఈడ్పుగంటి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
కైలే అనిల్‌కుమార్


