అమరజీవి త్యాగం అజరామరం
కోనేరుసెంటర్: ఆఽంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనిదని కృష్ణా జిల్లా ఎస్పీ వీవీఎస్ నాయుడు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు కఠోర నిర్ణయంతో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరుయ్యాడన్నారు. పొట్టి శ్రీరాములు జీవితం మన అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


