అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ● ఉయ్యూరు నగర పంచాయతీకి చెందిన పడాల రమణ(52)కు ఎలాంటి జీవనాధారం లేదు. 2018లో ప్రమాదవశాత్తూ రెండు కాళ్ల ఎముకలు విరిగిపోయాయి. వైద్యం చేయించినా ఆశించిన ఫలితం లేదు. దీంతో ఆయనకు 71 శాతం వికలాంగత్వం ఉన్న ధ్రువీకరణపత్రం ఇచ్చారు. అయినప్పటికీ దివ్యాంగుల పింఛను మంజూరు చేయడం లేదని.. తన పరిస్థిని చూసి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
● జిల్లాలో రైతులు వరి ధాన్యం అమ్ముకునేందుకు గోనెసంచులు, వాహనాల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమశాతం ఎక్కువగా ఉందని ఒక్కొక్క క్వింటాకు 12 కిలోలు తరుగు తీసి కడుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే 1318 రకం వరి ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో ధాన్యం రాశులు రహదారిపై గుట్టలుగా ఉండిపోతున్నాయి. వీటన్నింటిని అధికారులు పరిగణనలోకి తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది రామ్మోహనరావు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
‘మీ కోసం’లో కలెక్టర్ డీకే బాలాజీ ప్రజల నుంచి 151 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధిక ప్రాధాన్యతతో శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ ఎం. నవీన్, ఇన్‌చార్జ్ డీఆర్వో శ్రీదేవి, ఏఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాకపోతే వెంటనే సంబంధిత అర్జీదారునికి ఏ విధంగా పరిష్కరించాలో వివరించే వివరణతో సమాధానం ఇవ్వాలన్నారు. మీ కోసంలో 151 అర్జీలను అధికారులు స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..