కార్టూనిస్టుల సేవలు ఎనలేనివి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్టూనిస్టుల సేవలు ఎనలేనివని, ప్రజల హితాన్ని కాంక్షిస్తూ కార్టూనిస్టులు సేవలు అందిస్తున్నారని ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం, అమరావతి’ ఆవిర్భావ సభ సంఘం అధ్యక్షుడు బాచీ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. కార్టూనిస్టుల సంఘానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చూస్తానన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. కార్టూన్ అంటే అందరికీ మక్కువేనన్నారు. అందరికీ హాస్యం ఇష్టమని, కార్టూన్‌కు ఎప్పుడు ఆదరణ ఉంటుందని చెప్పారు.


