ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్ బీ’ సెమీ ఫైనల్
●నాలుగు కేటగిరీల్లో పరీక్షలు నిర్వహణ
●278 మంది విద్యార్థుల హాజరు
●ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి హాజరైన విద్యార్థులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై నైపుణ్యాలను పెంచేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. గతంలో జరిగిన క్యార్టర్ ఫైనల్ రౌండ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సెమీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ, బందరురోడ్డులోని నలంద డిగ్రీ కాలేజీలో జరిగిన పరీక్షలకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ స్కూల్స్ నుంచి 278 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. కేటగిరి–1లో 39 మంది, కేటగిరీ–2లో 78 మంది, కేటగిరీ–3లో 94 మంది, కేటగిరీ–4లో 67 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి కనబరిచి వారే స్వయంగా తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కాలేజీ ఆవరణలో సందడి నెలకొంది. ప్రధాన స్పాన్సర్‌గా డ్యూక్స్ వాఫీ, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషన్ స్కూల్(రాజమండ్రి) వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షలను నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అనురాధ, ఏఓ కాళీప్రసాద్ పర్యవేక్షించారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న ఫైనల్ రౌండ్ పరీక్షలకు అర్హత సాధిస్తారని ఈవెంట్స్ అసిస్టెంట్ మేనేజర్ ఇ.శ్రీహరి తెలిపారు.
ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్ బీ’ సెమీ ఫైనల్
ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్ బీ’ సెమీ ఫైనల్


